E-Paper
Advertisement

With Love : హీరోగా మారిపోయిన మరో డైరెక్టర్, క్యూట్ లవ్ స్టోరీ సెట్ చేసుకున్నాడు

With Love : హీరోగా మారిపోయిన మరో డైరెక్టర్, క్యూట్ లవ్ స్టోరీ సెట్ చేసుకున్నాడు
Advertisement

With Love : షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన అభిషేన్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తెలుగులో విడుదల కాకపోయినా కూడా చాలామంది తమిళ్ లాంగ్వేజ్ లోనే చూశారు. భాష అర్థం కాకపోయినా కూడా ఆ సినిమాకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమా ఒక వండర్.

అయితే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. ప్రతి మంచి సినిమా మీద కూడా కొన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి కూడా అలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అక్రమంగా దేశంలోకి ఒక ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఇల్లీగల్ అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి, నాని వంటి ప్రముఖులు కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.

హీరోగా మారిపోయాడు 

Advertisement

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు అభిషేన్. ఆ పాత్రను అతను తప్పితే మరెవరు చేయలేరు అనిపించేలా నటించాడు. ముఖ్యంగా ఆ సీన్ చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగటం అనేది సహజంగానే జరుగుతుంది. అప్పుడే అతనిలో అద్భుతమైన నటుడు ఉన్నాడు అని చాలామందికి అర్థం అయిపోయింది.

మొత్తానికి తను హీరోగా విత్ లవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ కొద్దిసేపటి క్రితమే సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేశారు. ఆ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు కంప్లీట్ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అర్థమవుతుంది. ఈ సినిమాలో అభిషేన్ తో పాటు అనస్వరి రాజన్ కలిసి నటిస్తుంది.

Advertisement

కంటిన్యూ చేస్తాడా 

దర్శకుడుగా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్లీ దర్శకుడుగా సినిమా చేస్తాడా లేకపోతే నటుడుగా కంటిన్యూ అయిపోతాడు అనేది చాలామందికి ఉన్న ఒక సందేహం.

అయితే రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మిస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్, ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగులో ఉంటుందా ఉండదా అనేది ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు.

Also Read: The Raja Saab : నాలుగు పాటలు షూట్ పూర్తయ్యాయి , కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×