E-Paper
Advertisement

Tharun Bhascker: విజయ్ దేవరకొండ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అదే: తరుణ్ భాస్కర్

Tharun Bhascker: విజయ్ దేవరకొండ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అదే: తరుణ్ భాస్కర్
Advertisement

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్ననేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన వ్యక్తిగత విషయాలతో పాటు తన వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)గురించి తరుణ్ భాస్కర్ కు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

పెళ్లిచూపులు మూవీ..

తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలం పూర్తి అయినప్పటికీ సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. విజయ్ దేవరకొండ కెరియర్ చూస్తే కేవలం అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాలు మినహా ఆ స్థాయిలో సక్సెస్ అందుకున్న సినిమాలు ఏవి లేవు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటూ తరుణ్ భాస్కర్ కు ప్రశ్న ఎదురైంది.

అర్జున్ రెడ్డి ఐకానిక్ సినిమా..

Advertisement

విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో. ఆయన నటించిన అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాలు ఐకానిక్ సినిమాలు. విజయ్ చేసే సినిమాలు ఏవి కూడా వేలు ఎత్తి చూపించే విధంగా ఉండవని, చాలా అద్భుతంగా ఉంటాయని తెలిపారు. ఇక తదుపరి చేయబోయే సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఇలా మంచి సినిమాలు చేసినప్పటికీ విజయ్ దేవరకొండకు సక్సెస్ రాకపోవడానికి కారణం తనని కొంతమంది టార్గెట్ చేయడమేనని తెలిపారు.

విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారా?

Advertisement

సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా ఒక మనిషి ఎత్తులో ఉంటే వెంటనే వాళ్లను కింద పడేయడం అలవాటు. తిరిగి మళ్లీ వారిని పైకి తీసుకెళ్లడం కూడా వాళ్లే చేస్తారు.. అలా జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటేనే వాళ్లు బ్రతికున్నట్టు అర్థం . ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలాగే ఉందని, అందుకే విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ అందుకోలేకపోయారని తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ చెప్పిన విధంగానే విజయ్ దేవరకొండను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్దేశపూర్వకంగానే తన సినిమాలపై నెగెటివీటి స్ప్రెడ్ చేస్తున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక విజయ్ దేవరకొండ చివరిగా కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే రణబాలి, రౌడీ జనార్దన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Arijit singh Retirment: రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్.. షాక్ లో ఫాన్స్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×