// // Akira Nandan in OG - సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్... -->
E-Paper
Advertisement

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్
Advertisement

Akira Nandan Works in OG: మెగా, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా అకీరా నందన్‌ ఎంట్రీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నట వారసుడిగా.. అకీరాను వెండితెరపై చూడాలని అభిమానులంత కుతూహలంగా ఉన్నారు. అతడి ఎట్రీ ఎప్పుడెప్పుడా? అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, అతడి తల్లి రేణు దేశాయ్‌ మాత్రం.. మీ ఇష్టాన్ని తన కొడుకుపై రుద్దకండి అంటూ వారించింది. అకీరాకి నటనపై కంటే మ్యూజిక్‌పై ఆసక్తి అని చెప్పి ట్విస్ట్‌ ఇచ్చింది. ఒకవేళ తన ఎంట్రీ ఉన్న.. సంగీత దర్శకుడిగానే ఇస్తాడని ఓ ఇంటర్య్వూలో తెలిపింది. 

ఆ రూమర్సే నిజమయ్యాయి..!

Advertisement

అయినా అభిమానులు నుంచి మాత్రం అకీరా కనిపించిన ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతుంటారు. ఈ క్రమంలో అతడు ఓజీ చిత్రంలో ఆరంగేట్రం చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ సినిమాలో పవన్‌ యంగ్‌ లుక్‌లో అకీరా కనిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలు విని అంత నిజమే అనుకున్నారు. కారణం.. ఈ మధ్య పవన్‌ ఎక్కడికి వెళ్లిన అకీరాను వెంటబెట్టుకునే వెళుతున్నాడు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత అకీరా తండ్రి వెన్నంటే ఉన్నాడు. ఏ ఈవెంట్, ఏ పొలిటికల్‌ మీటింగ్‌ అయినా.. పవన్‌ పక్కన అకీరా కనిపించాడు. దీంతో నెక్ట్స్‌ తన వారసుడిగా అకీరాని పవన్‌ చెప్పకనే చెప్పాడు అని అభిమానులు అనుకున్నారు. అంటే అకీరా సినీ రంగ ప్రవేశానికి టైం వచ్చిందని అనుకున్నారు. అదే టైంలో ఓజీలో అకీరా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. 

ఇది ఊహించలేదు.. తమన్ భయ్యా!

దీంతో ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుషి.. అకీరా ఎంట్రీని ఊహించాం. కానీ, తన తండ్రి చిత్రంతోనే అతడి అరంగేట్రం ఉంటుందని అసలు ఊహించలేదు.. ఇక థియచేటర్లలో రచ్చ రచ్చే అన్నారు. తీరా చూస్తే.. ఓజీలో అకీరా లేడు. దీంతో అభిమానులంత ఫుల్‌ డిసప్పాయింట్‌ అయ్యారు. ఈ క్రమంలో పవన్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సూపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఓజీ అకీరా వర్క్‌ చేశాడని రివీల్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. కాగా ఓజీ సినిమాకు తమన్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ని కూడా అతడే ఇచ్చాడు. ఇక మూవీ రిలీజ్ సందర్బంగా తమన్‌ వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తూ హైప్‌ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్‌ అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌ చేశాడు. 

Advertisement

Also Read: OG Movie: రెండు భాగాలుగా ‘ఓజీ‘ మూవీ.. హీరో మాత్రం పవన్‌ కాదు.. మరెవరంటే!

ఓజీ సినిమాకు అకీరా పని చేసినట్టు చెప్పాడు. ‘అకీరాలో మంచి టాలెంట్‌ ఉంది. అతడు భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. తన మంచి మ్యూజిషియన్‌ దాగి ఉన్నాడు. తన వర్క్‌ ఎలా ఉంటుందో నేను చూశాను. కచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలకు అతడు వర్క్‌ చేస్తాడు. ఇక ఓజీ సినిమా కోసం మనిద్దరి కలిసి వర్క్‌ చేద్దామని అన్నాను. అకీరా కూడా ఒకే అన్నాడు. ఓజీ అతడు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. చాలా అద్బుతంగా వచ్చింది. తన తండ్రి సినిమాకే అతడు వర్క్‌ చేయడంతో ఎంతో హ్యాపీగా ఫీల్‌ అయ్యాడు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది‘ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇది తెలిసి పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంత ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఇచ్చేసినట్టేనా అని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం వెండితెర ఎంట్రీ కూడా ఉంటే బాగుండంటూ వారి మనసులో మాటను బయటపెడుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×