// // Jana Nayagan- విజయ్‌ 'జన నాయగన్‌' వాయిదా.. టీం క్లారిటీ! -->
E-Paper
Advertisement

Jana Nayagan: విజయ్‌ ‘జన నాయగన్‌’ వాయిదా.. సాలీడ్‌ పోస్టర్‌తో వచ్చిన టీం!

Jana Nayagan: విజయ్‌ ‘జన నాయగన్‌’ వాయిదా.. సాలీడ్‌ పోస్టర్‌తో వచ్చిన టీం!
Advertisement

Thalapthy Vijay Jana Nayagan Update: దళపతి విజయ్‌ ప్రస్తుతం తన పొలిటికల్‌ ఎంట్రీపై ఫోకస్డ్‌గా ఉన్నాడు. సినిమా కంటే కూడా రాజకీయాల్లోనే నిలదొక్కుకోవాలనే తపనతో ఉన్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీఎం సీటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈ మేరకు ప్రచారాలు కూడా ముమ్మరం చేశాడు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ పేరును మార్చి ఎలక్షన్‌ కమిషన్‌ చేత ఆమోద ముద్ర కూడా తీసుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కరూర్‌ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కరూర్ ఘటనతో వాయిదా?

Advertisement

ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కొల్పోవడంతో విజయ్‌కి నెగిటివిటీ పెరిగింది. అంతేకాదు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తూ.. సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్న విజయ్‌ చివరిగా జననాయగన్‌ (తెలుగులో జన నాయకుడు) పేరుతో సినిమా చేస్తున్నాడు. ఇదే ఆయన ఆఖరి మూవీ కూడా. అంతేకాదు తన రాజకీయ ఆరంగేట్రానికి ప్లస్‌ అయ్యేలా ఈ చిత్రాన్ని పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. అలాంటి ఈ సినిమా విజయ్‌ కరూర్‌ తొక్కిసలాట ఘటనతో వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతుంది.

మూవీ టీం క్లారిటీ

ఆయ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశానికి మరింత బలం ఇచ్చేలా దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఈ సినిమాను పక్కాగా ప్లాన్‌ చేశాడు. అయితే తొక్కిసలాట ఘటనతో విజయ్‌కి నెగిటివిటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదని వాయిదా వేసే దిశగా మూవీ టీం ప్లాన్‌ చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై తాజాగా మూవీ టీం స్పందించింది. ఈ సందర్భంగా మేకర్స్‌ సాలీడ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Advertisement

Also Read: Master Rohan: అన్న.. రౌడీ షర్టులు రెడీ పెట్టుకో.. విజయ్‌ దేవరకొండకు మాస్టర్‌ రోహన్‌ స్పెషల్‌ రిక్వెస్ట్‌!

కొత్త పోస్టర్ విడుదల

విజయ్‌ జనాల మధ్యలో నిలుచుని ఉండగా చూట్టూ ప్రజలు ఆయనపై చేయి వేసి ఉన్నట్టుంది. ఈ పోస్టర్‌ విడుదల చేస్తూ సినిమా వచ్చే ఏడాది పొంగల్‌కే విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. జనవరి 9వ తేదీనే జననాయగన్ రిలీజ్‌ అవుతుందని వెల్లడించారు. మూవీ టీం అప్‌డేట్‌ ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌ చెక్‌ పడింది. దీంతో ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. తమిళ్‌ టాప్‌ బ్యానర్‌ కెవీఎన్ ప్రొడక్షన్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. ఈ సినిమా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే ప్రేమలు బ్యూటీ మమిత బైజు సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×