E-Paper
Advertisement

తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!

తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!
Advertisement

TeluguOne Production: గత 26 సంవత్సరాలుగా మీడియా రంగంలో అత్యున్నత ప్రమాణాలతో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ తెలుగువన్ (TeluguOne). భారతదేశంలోనే యూట్యూబ్‌తో ముడిపడిన తొలి తెలుగు ఛానల్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన తెలుగువన్, వైవిధ్యభరితమైన కంటెంట్‌తో కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైంది. డిజిటల్ రంగంలో తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ, 2024లో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

Read also-ఆసుపత్రి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్.. ఇక మాటల్లేవ్..

Advertisement

తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై రైతుల సమస్యల నేపథ్యంతో వచ్చిన తొలి చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ సినిమా సాధించిన ఘన విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సంస్థ తమ ‘ప్రొడక్షన్ నెం.2’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.

దర్శకుడిగా బిగ్ ప్లాన్!

తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు (మే 19) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌కు ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా, తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరిస్తుండటం విశేషం.

Advertisement

Read also-పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..

రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను తెలుగువన్ కార్యాలయంలో సిబ్బంది మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న తెలుగువన్ డైరెక్టర్ రమేష్, రవిశంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ రెండో చిత్రం అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×