E-Paper
Advertisement

Movie Tickets Giveaway : గివ్ఎవే.. ప్రొడ్యూసర్స్‌కి తలనొప్పి.. వీళ్లకు ఫ్రీగా ఫాలోవర్స్?

Movie Tickets Giveaway : గివ్ఎవే.. ప్రొడ్యూసర్స్‌కి తలనొప్పి.. వీళ్లకు ఫ్రీగా ఫాలోవర్స్?
Advertisement

Movie Tickets Giveaway : ఈ మధ్య ట్విట్టర్ (X)లో ఒకటి గమనించారా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ తమను ఫాలో అయితే… మూవీ టికెట్స్ ఫ్రీగా ఇస్తామంటూ పోస్టులు పెడుతున్నారు. తమ అకౌంట్‌ను ఫాలో అయి… లైక్ చేసి, కామెంట్ చేసి రీ ట్వీట్ చేస్తే మూవీ టికెట్స్ గివ్‌ఎవే ఇస్తామంటూ పోస్టులు పెడుతున్నారు. ఇవి ప్రతి వారం ట్విట్టర్‌ (X) లో జరుగుతూనే ఉంది. మరి ఆ టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ ఆ టికెట్స్ కొంటున్నారా? అనేది ఈ ఆర్టికల్‌లో డీటైల్డ్ గా చూద్దాం.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా పేజీల్లో కొంత మంది తమ ఫాలోవర్స్‌కు వస్తువులను గివ్‌ఎవే ఇస్తారు. ఇప్పుడా సంస్కృతి సినిమా ఇండస్ట్రీలోకి కూడా పాకింది. కొంత మంది మూవీ టికెట్స్ ఫ్రీగా ఇస్తామంటూ ట్వీట్స్ వేస్తున్నారు.

Advertisement

ఫ్రీగా అంటే పూర్తిగా ఫ్రీ అని ఏం కాదు… దానికి కొన్ని కండీషన్స్ పెడుతున్నారు. ఎవరైతే, టికెట్స్ కావాలని అనుకుంటే… వారిని ఫాలో అవ్వాలి. కామెంట్ చేయాలి. లైక్ కొట్టాలి. ఇలా చేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది. పక్కాగా రాదు. మరి ఇలా ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నారు కదా… టికెట్స్ వాళ్లకు ఎలా వస్తున్నాయని ఆలోచించారా ?

నిజానికి ఆ టికెట్స్ ఆ పోస్టులు పెట్టే ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌, జర్నలిస్ట్‌లు సొంతంగా కొనేవి కాదు. సొమ్ము ఒక్కడిది.. సోకు ఒక్కడిది అన్నట్టు… వారు ఇచ్చే టికెట్స్ అన్నీ నిర్మాతలే ఇస్తారు. నిర్మాతల దగ్గర నుంచి తీసుకుని టికెట్స్ గివ్‌ఎవే అంటూ తమ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి పోస్టులు పెట్టి… ఫాలోవర్స్‌ను పెంచుకుంటారు.

Advertisement

అలా… ప్రతి సినిమా రిలీజ్‌కు 30 మందికి పైగా ఇలాంటి మూవీ టికెట్స్ గివ్‌ఎవే ఇస్తారు. వారందరికీ ఆ సినిమా నిర్మాతనే టికెట్స్ స్పాన్సర్స్. అంటే తక్కువలో తక్కువ ఈ ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌, జర్నలిస్ట్‌లు పెట్టే గివ్‌ఎవే వల్ల నిర్మాతకు 1 లక్ష రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది.

దీని వల్ల నిర్మాతకు ఎలాంటి రిజెల్ట్ ఉంటుందో తెలీదు కానీ, ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌, జర్నలిస్ట్‌లకు అయితే… భారీగా సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే రెడీ అవుతున్నారు.

సో… మొత్తంగా ఈ గివ్‌ఎవే కాన్సెప్ట్ వల్ల నిర్మాతల జేబుకు చిల్లు పడితే… వాళ్లకు మాత్రం ఫ్రీగా టికెట్స్ ఇస్తూ.. అంతే ఫ్రీగా ఫాలోవర్స్‌ను సంపాదిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×