E-Paper
Advertisement

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు
Advertisement

Telugu Film Workers : గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లేదు జరగటం లేదు. దీనికి కారణం తెలుగు సినిమా కార్మికులంతా కలిసి సమ్మె మొదలుపెట్టారు. తమ వేతనాలు 30% వరకు పెంచాలి అనేది వాళ్ళ డిమాండ్. ఆల్రెడీ చాలా ఎక్కువగానే ఇస్తున్న మళ్లీ పెంచడం కష్టం అనేది నిర్మాతల రెస్పాన్స్.

మొత్తానికి అటు నిర్మాతలు తగ్గలేదు, ఇటు సినిమా కార్మికులు తగ్గలేదు. అందుకనే మొత్తానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలు షూటింగ్ జరగలేదు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూ కి నేడు శుభం కార్డు పడిపోయింది. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అనే రంగంలోకి దిగడంతో అంత క్లియర్ అయింది.

Advertisement

సీఎంపై ప్రశంసల జల్లు 

గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఈ ఇష్యూ నేటితో క్లారిటీ వచ్చేసింది. రేపటి నుంచి షూటింగ్స్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా…

ఎంతో జ‌టిల‌మైన‌ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ను చాలా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా, ఇటు నిర్మాత‌లకు, అటు కార్మికులకు స‌మ‌న్యాయం జ‌రిగే విధంగా ప‌రిష్క‌రించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకొంటున్నాను.

 

తెలుగు చిత్ర‌సీమ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి గారు తీసుకొంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయం. హైద‌రాబాద్ ను దేశానికే కాదు, ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర రంగానికే ఓ హ‌బ్ గా మార్చాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌లు, అందుకు చేస్తున్న కృషి హ‌ర్షించ‌ద‌గిన‌వి.

 

తెలుగు చిత్ర‌సీమ ఇలానే క‌లిసి మెలిసి ముందుకు సాగాల‌ని, ప్ర‌భుత్వం కూడా అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు అందిస్తుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటున్నా.

https://Twitter.com/KChiruTweets/status/1958583510345851165?t=ZIAwOC3izm5873Mzk-OSRQ&s=19

మైత్రి మూవీ మేకర్ సంస్థ కూడా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

https://Twitter.com/MythriOfficial/status/1958579692577202261?t=NQIEkfoMkV23HnXSb6YBrw&s=19

అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

https://Twitter.com/peoplemediafcy/status/1958578973073723584?t=E_7oJT9Nc1lU5xdg1Nmdhw&s=19

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×