E-Paper
Advertisement

Drivers Union: సినిమా డ్రైవర్ల యూనియన్‌లో భారీ కుంభకోణం.. రూ.11 కోట్ల నిధుల మళ్లింపుపై ఫిర్యాదు..

Drivers Union: సినిమా డ్రైవర్ల యూనియన్‌లో భారీ కుంభకోణం.. రూ.11 కోట్ల నిధుల మళ్లింపుపై ఫిర్యాదు..
Advertisement

Drivers Union: తెలుగు సినిమా డిజిటల్ వెబ్ సిరీస్ డ్రైవర్స్ యూనియన్ (Telugu Cinema Digital Web Series Drivers Union) నాయకత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం దాచిన సుమారు రూ. 11 కోట్ల రూపాయల నిధులను ప్రస్తుత కార్యవర్గం దుర్వినియోగం చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సభ్యుడు సూర్ల రమేష్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read also-Anna Lezhneva: పిలుపులు వేరైనా ఆ భావం ఒక్కటే.. మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్!

ప్రధాన ఆరోపణలు

Advertisement

నిధుల మళ్లింపు: గత పాలకవర్గాలు హెచ్‌డిఎఫ్‌సి (HDFC), యూనియన్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన రూ. 11 కోట్ల రూపాయలను, ప్రస్తుత నాయకులు సభ్యులకు తెలియకుండానే రద్దు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సుమారు 40 మంది వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసినట్లు బ్యాంకు రశీదుల ద్వారా వెల్లడైందని బాధితులు ఆరోపిస్తున్నారు.

భూమి కొనుగోలులో: అచ్చంపేట సమీపంలో 44 ఎకరాల భూమిని ఎకరం రూ. 24 లక్షల చొప్పున కొనుగోలు చేశామని నాయకులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో విచారించగా అక్కడ ఎకరం ధర కేవలం 12 నుండి 15 లక్షలు మాత్రమే ఉందని బాధితులు తెలిపారు. ఈ భూమి నివాసానికి ఏమాత్రం యోగ్యంగా లేదని, సభ్యుల కష్టార్జితాన్ని కాజేసేందుకే ఈ ప్లాన్ వేశారని ఆరోపించారు.

Advertisement

నిరంకుశ పోకడలు: యూనియన్ కార్యాలయం పునరుద్ధరణ పేరుతో రూ. 16 లక్షలు, ఒక ఫంక్షన్ కోసం రూ.8.5 లక్షలు ఖర్చు చేశామని లెక్కలు చూపుతున్నారని, వీటిపై వివరణ అడిగిన సభ్యులను సస్పెండ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

సభ్యులపై వేధింపులు: అక్రమాలను ప్రశ్నించినందుకు సూర్ల రమేష్‌ను 6 నెలల పాటు యూనియన్ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా, అతని వాహనాలపై డ్రైవర్లు పని చేయకుండా అడ్డుకుంటూ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also-Nagabandham Movie: రిలీజ్‌కి రెడీ అయిన అభిషేక్ నామా ‘నాగబంధం’.. వచ్చేది ఎప్పుడంటే?

విచారణకు డిమాండ్

యూనియన్ అధ్యక్షుడు బి. సీతారాం, సెక్రటరీ మహబూబ్ బేగ్ (కదిరి భాష), కోశాధికారి పి. వెంకటేష్ తదితరులపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు పోలీసులను కోరారు. దారి మళ్లించిన నిధులను తిరిగి యూనియన్ ఖాతాకు చేర్చి, సామాన్య డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోని కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×