E-Paper
Advertisement

థియేటర్ల మనుగడ కోసమే ఎగ్జిబిటర్ల పోరాటం.. పర్సంటేజ్ విధానంపై తేల్చాల్సిందే!

థియేటర్ల మనుగడ కోసమే ఎగ్జిబిటర్ల పోరాటం.. పర్సంటేజ్ విధానంపై తేల్చాల్సిందే!
Advertisement

Theatre Crisis: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిలో పడింది. రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, జీఎస్టీ భారం, కరెంట్ బిల్లుల మోతతో కుదేలవుతున్న ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆర్-పార్ పోరాటానికి సిద్ధమయ్యారు. “పర్సంటేజ్ పద్ధతి ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేస్తాం.. లేదంటే ప్రదర్శనలు నిలిపివేస్తాం” అంటూ ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి రావడం టాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

Read also-నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

Advertisement

ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరియు ప్రొడ్యూసర్ల అత్యవసర సమావేశం ఇండస్ట్రీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. తెలంగాణ నలుమూలల నుండి ఎగ్జిబిటర్లు భారీ ఎత్తున ఈ భేటీకి తరలివస్తుండటంతో ఫిలిం ఛాంబర్ పరిసరాలు వేడెక్కాయి.

తెరవెనుక అసంతృప్తి!

Advertisement

గతంలో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ చర్చనీయాంశమైంది. ఎగ్జిబిటర్ల సమస్యలను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దల నుండి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు.

Read also-Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..

ముఖ్యంగా, పెద్ద సినిమాల విడుదల సమయంలో ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను పక్కనబెట్టి, పాత రెంట్ల పద్ధతి లేదా కనీస గ్యారెంటీ (MG)ల కోసమే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎగ్జిబిటర్ల హక్కులను కాపాడటంలో ఇండస్ట్రీ అంతర్గత ఒత్తిళ్లు, న్యాయమైన డిమాండ్ల పట్ల కొందరు చూపిన ఉదాసీనత వల్లే, తీవ్ర అసంతృప్తితో సునీల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్ల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రాజీనామా కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది వ్యవస్థపై జరిగిన నిరసనగా ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×