E-Paper
Advertisement

Telangana Gaddar Film Awards: జ్యూరీ కమిటీ ఛైర్మన్ మార్పు.. ఇప్పుడెవరంటే?

Telangana Gaddar Film Awards: జ్యూరీ కమిటీ ఛైర్మన్ మార్పు.. ఇప్పుడెవరంటే?
Advertisement

Telangana Gaddar Film Awards: కళాకారులకు ఇచ్చే పురస్కారాలైన నంది అవార్డ్స్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy) ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Telangana Gaddar Film Awards)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఈ సత్కార్యాన్ని మళ్లీ పున: ప్రారంభించి, ఆగిపోయిన సంవత్సరం నుంచి లెక్క పెట్టి అన్ని సంవత్సరాలకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవార్డులను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అవార్డుల జ్యూరీ కమిటీలో అనూహ్య మార్పు సంభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ను మార్చారు. ఇంతకు ముందు ఉన్న ఛైర్మన్‌ను మార్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన మరో దర్శకనిర్మాతకు ఆ హోదా కల్పించారు. వివరాల్లోకి వెళితే..

Also Read- Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి కోసం ఖర్చు ఎంతో తెలుసా? ఎంతైనా నేషనల్ క్రష్ కదా?

రాఘవేంద్రుని స్థానంలో తమ్మారెడ్డి..

Advertisement

తొలుత ఈ కమిటీ చైర్మన్‌గా సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావును ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయన స్థానంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy)ను చైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జీవో నెంబర్ 236ను జారీ చేసింది. మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియలేదు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ కేవలం సినిమా రంగం మాత్రమే కాకుండా, సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. ప్రజా కవి గద్దర్ పేరు మీదుగా ఇస్తున్న ఈ అవార్డుల ప్రక్రియలో తమ్మారెడ్డి భరద్వాజ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read- The Kerala Story 2 Telugu Trailer: ది కేరళ స్టోరీ 2 తెలుగు ట్రైలర్ విడుదల.. మొదటి భాగం కన్నా సంచలనంగా..!

స్పెషల్ అవార్డుల కేటగిరీ పర్యవేక్షణ

Advertisement

2024 జనవరి 31న ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డుల పేరును అధికారికంగా ప్రకటించారు. దాదాపు 10 సంవత్సరాల అవార్డులను ఒకేసారి ప్రకటించి, అవార్డుల వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి‌గానూ విజేతల ఎంపిక జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఇప్పుడు నూతనంగా ఎంపికైన ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ.. టీమ్‌తో కలిసి స్పెషల్ అవార్డుల కేటగిరీలోని విజేతల ఎంపికను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.

Also Read- VK Naresh: నాకు కావాల్సినట్టు నేను మాట్లాడుతా.. కావాలంటే ట్రోల్ చేసుకోండి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×