E-Paper
Advertisement

Jana Nayagan: జననాయగన్ సెన్సార్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ హీరో శింబు..

Jana Nayagan: జననాయగన్ సెన్సార్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ హీరో శింబు..
Advertisement

Jana Nayagan: చాలా రోజుల నుంచి తమిళ సినీ పరిశ్రమలో విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా విడుదలపై అనిశ్చితి ఏర్పడింది. సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)తో న్యాయపరమైన అంశాలు రావడంతో సినిమా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో నటుడు సిలంబరాసన్ టీఆర్ (సింబు) బహిరంగంగా విజయ్‌కు మద్దతుగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింబు మాట్లాడుతూ, “జన నాయగన్‌ను విజయ్ నుంచి వేరుచేసి చూడలేం” అని స్పష్టంగా చెప్పారు. విజయ్ ఈ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేశారని, ఇది ఆయన చివరి సినిమా కావడంతో తప్పకుండా ప్రేక్షకుల ముందుకు రావాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాను సోషల్ మీడియాలో విజయ్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టానని చెప్పారు.

Advertisement

సింబు ఇంకా మాట్లాడుతూ, తాను రాజకీయాల గురించి మాట్లాడే అర్హత తనకు లేదని, రాజకీయ అనుభవం కూడా లేదని చెప్పారు. కానీ ఒక నటుడిగా, సీనియర్ ఆర్టిస్ట్‌గా విజయ్‌కు ఈ సినిమా చాలా ముఖ్యమని భావించి మద్దతు తెలిపానన్నారు. భవిష్యత్తులో విజయ్ రాజకీయ ప్రయాణానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమా విషయంలో జనవరిలో మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. మొదట సింగిల్ జడ్జ్ బెంచ్ సీబీఎఫ్‌సీకి సినిమా సర్టిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించగా, తర్వాత డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను రద్దు చేసింది. సెన్సార్ బోర్డ్‌కు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సిందని కోర్టు పేర్కొంది. దీంతో నిర్మాతలు, సీబీఎఫ్‌సీ మళ్లీ సింగిల్ జడ్జ్ బెంచ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా సినిమాకు సర్టిఫికెట్ రాకపోవడంతో విడుదల తేదీ ఖరారు కాలేదు.

Advertisement

ఇదిలా ఉండగా, సింబు గతంలో కూడా విజయ్‌కు ధైర్యం చెప్పే మాటలు చెప్పారు. “విజయ్ అన్నా, మీరు ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నారు. ఇది కూడా దాటిపోతుంది. జన నాయగన్ విడుదలైన రోజే అసలైన పండుగ మొదలవుతుంది” అంటూ సోషల్ మీడియాలో రాశారు.

జన నాయగన్ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, విజయ్ సినీ ప్రయాణానికి ముగింపు కావడంతో అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సింబు లాంటి నటులు మద్దతుగా నిలవడం వల్ల ఈ విషయం మరింత చర్చకు దారి తీసింది.
ALSO READ: Animal Park: రెండో భాగం రాకుండానే మూడో భాగం పై వర్క్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×