E-Paper
Advertisement

Tamannaah Bhatia: నిమిషానికి కోటి .. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నటి!

Tamannaah Bhatia: నిమిషానికి కోటి .. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నటి!
Advertisement

Tamannaah Bhatia: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలలో వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తమన్నా మరోవైపు స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన తమన్నాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతున్న తమన్నా..

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు పెద్ద ఎత్తున పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా హీరోయిన్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. ఇక తమన్నా ఇప్పటికే చేసిన పాటలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈమెకు స్పెషల్ సాంగ్స్ విషయంలో భారీగా క్రేజ్ ఉంది. అయితే ఒక్కో పాటకు తమన్నా తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

గోవాలో స్పెషల్ పర్ఫార్మెన్స్..

Advertisement

ఒక్కో సినిమాకు సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే తమన్నా స్పెషల్ సాంగ్స్ కి మాత్రం అంతకుమించి రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల న్యూ ఇయర్స్ సందర్భంగా ఈమె గోవాలో చేసిన ఒక ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా బీచ్ లో తమన్నా 6 నిమిషాల పాటు ఒక పాటకు డాన్స్ చేశారు అయితే ఈ పాటకు డాన్స్ చేసినందుకుగాను ఈమె ఏకంగా ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గోవాలో పార్టీలంటే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్పెషల్ సాంగ్ కు 6 కోట్లు?

Advertisement

ఈ నేపథ్యంలోనే తమన్నా గోవా ఈవెంట్ లో సందడి చేస్తూ ఒక పాటకు 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తమన్నా ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలి అంటే ఈ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం అవుతుంది. ఇలా ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆరు కోట్ల రెమ్యూనరేషన్ అంటే నిర్మాతలకు శృతి మించిన భారమనే చెప్పాలి. ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు ఈమె తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Allu Arjun Lokesh Kanagaraj: ఫాన్స్ గెట్ రెడీ.. AA 23 లోడింగ్.. ఇది కదా అసలు పండుగ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×