E-Paper
Advertisement

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్ మొదలు పెట్టిన తమన్నా.. ఇంతకీ అదేమిటంటే..!

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్ మొదలు పెట్టిన తమన్నా.. ఇంతకీ అదేమిటంటే..!
Advertisement

Tamannaah Bhatia: సెలబ్రిటీలు ఈమధ్య సినిమాలే కాకుండా పక్కన బిజినెస్ రంగంలో కూడా తెగ రాణిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఒకవేళ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తే పరిస్థితి ఏమిటి అని ముందుగానే అంచనా వేసుకొని.. బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు.

ఈ క్రమంలో..సినిమాలకే కాకుండా బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టింది ప్రముఖ నటి తమన్నా భాటియా. ఆమె తాజాగా తమన్నా ఫైన్ జ్యువెలరీ.. అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ విషయం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ tamannaahspeaks.. లో షేర్ చేసిన ఒక ఫోటోతో ఈ విషయం గురించి చెప్పకు వచ్చింది.

Advertisement

ఆ ఫోటోలో తమన్నా చాలా సింపుల్‌గా..క్లాసీగా కనిపించే ఉంగరాలు.. ఫైన్ జ్యువెలరీని ధరించి కనిపించింది. ఆమె ముఖాన్ని కొంతవరకు కప్పేలా ఆ ఆభరణాలు ఉండటం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోతో పాటు ఆమె ఒక క్యాప్షన్ కూడా రాసింది.

ఆ క్యాప్షన్‌లో తమన్నా ఆభరణాలపై తన ఆలోచనలను చాలా సింపుల్‌గా వివరించింది. ఆమె మాటల్లో చెప్పాలంటే..జ్యువెలరీ అనేది ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే కాదు. మన వ్యక్తిత్వానికి సరిపడేలా.. మన రోజువారీ జీవితంలో భాగంగా ఉండాలి. చాలా హైగా, బరువుగా ఉండే ఆభరణాల కంటే సింపుల్‌గా, అర్థవంతంగా ఉండే డిజైన్లు తనకు ఇష్టమని చెప్పింది. మన స్టైల్‌ను మించిపోకుండా..మనల్ని మనం వ్యక్తపరిచేలా జ్యువెలరీ ఉండాలని ఆమె భావన.

Advertisement

ఇలాంటి ఆలోచనల నుంచే తమన్నా ఫైన్ జ్యువెలరీ అనే బ్రాండ్ పుట్టిందని ఆమె చెప్పింది. ఈ బ్రాండ్ ద్వారా టైమ్‌లెస్ డిజైన్లు..కంఫర్ట్‌గా ఉండే ఆభరణాలను అందించాలనేదే ఆమె లక్ష్యం అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఫోటోల విషయం పక్కన పెరిగితే తాజాగా.. తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కూడా వార్తల్లో నిలిచింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై చాలా ఓపెన్‌గా మాట్లాడింది. తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయ్యిందని చెప్పింది. ఒకటి టీనేజ్‌లో జరిగిన ప్రేమ అని..కెరీర్ కోసం దాన్ని వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ నిర్ణయం కష్టం అయినా, భవిష్యత్తు కోసం అవసరమని భావించానని చెప్పింది.

ఇంకొక సంబంధం తన ఎదుగుదలకు ప్రమాదకరంగా అనిపించిందని..అందుకే దానినుంచి బయటకు వచ్చానని స్పష్టంగా చెప్పింది. ఈ వ్యాఖ్యల తర్వాత, సోషల్ మీడియాలో కొందరు ఆమె మాటలను నటుడు విజయ్ వర్మతో లింక్ చేస్తూ చర్చలు మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించినప్పటి నుంచి వారి గురించి రూమర్లు వినిపించాయి.

ALSO READ: Sreemukhi: గుడిలో రీతూ, డెమోన్ పెళ్లి…గుట్టు రట్టు చేసిన శ్రీముఖి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×