// // Tamannaah: స్టార్ కిడ్ కి జోడిగా తమన్నా! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tamannaah: జోరు పెంచిన తమన్నా.. స్టార్ కిడ్ కి జోడిగా అవకాశం!

Tamannaah: జోరు పెంచిన తమన్నా.. స్టార్ కిడ్ కి జోడిగా అవకాశం!
Advertisement

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah)గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో యువతను తన అభిమానులుగా మార్చుకున్న ఈమె.. అటు స్టార్ హీరోల ఫేవరెట్ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది.. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్న.. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా..ఇప్పటికీ తన క్రేజ్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పటి వరకు సీనియర్ , స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె ఇప్పుడు యంగ్ హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే ఒక స్టార్ హీరో వారసుడికి జోడిగా నటించనుంది.

స్టార్ హీరో వారసుడికి జోడిగా తమన్నా..

తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. అదిరిపోయే స్టెప్ లతో.. తనదైన నటనతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ కథల ఎంపిక విషయంలో ఈ మధ్యకాలంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈమె రాగిణి 3 అనే హారర్ చిత్రంలో నటిస్తోంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు రాగా , ఇప్పుడు త్వరలోనే దీనిపై అధికారికంగా వార్తలు వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తమన్నాకి జోడిగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించనున్నట్లు సమాచారం. హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతుండగా.. శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, జునైద్ కలయికతో ప్రేక్షకులకు ఒక కొత్త జంట పరిచయం కాబోతోంది అంటూ బాలీవుడ్ వర్గాలలో చర్చ కూడా మొదలైంది.

Advertisement

ఈ చిత్రానికి ఏక్తా కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చిత్ర సన్నిహిత వర్గాలు కూడా తెలిపాయి. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ హీరో లతోనే కాదు ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది తమన్నా.

తమన్నా ప్రస్తుత సినిమాలు..

తమన్నా ప్రస్తుత చిత్రాల విషయానికి వస్తే.. రాగిణి 3తో పాటు దీపక్ మిశ్రా దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ డ్రామా మూవీలో సిద్ధార్థ మల్హోత్రా సరసన హీరోయిన్గా నటిస్తోంది అదే వన్ వే. 2026 మే 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. అలాగే అజయ్ దేవగన్ , సంజయ్ దత్ లతో కలిసి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రేంజర్ లో కూడా నటిస్తోంది. ఈ సినిమా 2026 డిసెంబర్ 4వ తేదీన విడుదల కానుంది. అలాగే సాహిత్య కపూర్ ,తృప్తి డిమ్రి కాంబినేషన్లో వస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ఓ రోమియో సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు మరో రెండు హిందీ చిత్రాలతో పాటు ప్రముఖ నటుడు విశాల్, దర్శకుడు సుందర్ సి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఈ ఏడాది వరుస సినిమాలతో జోరు మీద ఉందని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ:Keerthy Suresh: కీర్తి సురేష్ కి రాష్ట్ర అవార్డ్.. ఆయన లేరంటూ ఎమోషనల్ పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×