E-Paper
Advertisement

Tabu Daughter: కూతురిని పరిచయం చేసిన టబు.. పెళ్లి కాకుండానే ఇంత పని చేసిందా..!

Tabu Daughter: కూతురిని పరిచయం చేసిన టబు.. పెళ్లి కాకుండానే ఇంత పని చేసిందా..!
Advertisement

Tabu: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో వరుస విజయాలతో ప్రేక్షకుల హృదయాలను గెలిచిన హీరోయిన్ Tabu గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసు 54 దాటినా కూడా ఆమె ఫిట్‌నెస్, లుక్స్, అభినయం ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్‌గా వెలుగొందిన రోజులు ముగిసినా, ఇప్పుడు కీలక పాత్రలు, బలమైన క్యారెక్టర్లతో తనదైన ముద్ర వేస్తూనే ఉంది. హిందీతో పాటు దక్షిణ భారత చిత్రాల్లోనూ టబు తన సత్తా చాటుతోంది.

ఇటీవల టబు చేసిన ఓ చిన్న పని సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒక సినిమా ప్రీమియర్ షోకు హాజరైన టబు, అక్కడ కనిపించిన ఓ యువతిని తన “కూతురు” అంటూ పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. “ఈ వయసులో టబుకు కూతురా?” అంటూ అనేక ప్రశ్నలు వినిపించాయి. అంతేకాదు పెళ్లి కాకుండా ఇంత పని చేసేసిందా అని కూడా సందేహాలు కురిపించారు. కానీ ఫైనల్ గా వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చింది హీరోయిన్.

Advertisement

అయితే అసలు నిజం ఏమిటంటే..అది రియల్ లైఫ్ విషయం కాదు. 1997లో వచ్చిన హిందీ సినిమా Chachi 420లో టబు కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్టే ఆ అమ్మాయి. ఆమె పేరు Fatima Sana Shaikh. ఆ సినిమాలో చిన్నపిల్లగా కనిపించిన ఫాతిమా సనా..ఇప్పుడు హీరోయిన్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..ప్రేమతో టబు ఆమెను తన కూతురిలా పరిచయం చేయడం జరిగింది.

ఈ సినిమా తెలుగులో భామనే సత్యభామనే అనే పేరుతో రీమేక్ అయింది. అప్పట్లో టబు-ఫాతిమా మధ్య తల్లి–కూతురు బంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ టబు ఇలా ఎమోషనల్‌గా స్పందించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement

ఇక టబు వ్యక్తిగత జీవితాన్ని వస్తే.. ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయినా కూడా ఆమె జీవితం సంపూర్ణంగా, సంతృప్తిగా ఉందని పలుమార్లు చెప్పింది. సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టిన టబు..కొత్త తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఈ హీరోయిన్ గురించి తెలుగులో ఒకప్పుడు ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈమె నాగార్జునతో ప్రేమలో ఉంది అన్న వార్త తెగ వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ విషయం గురించి టబు, నాగార్జున.. ఇద్దరూ కూడా.. పలుమార్లు స్పందిస్తూ.. తమ కేవలం స్నేహితులము మాత్రమే అని.. తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు.

అంతేకాదు ఇప్పటికీ కూడా టబు హైదరాబాద్ వస్తే నాగార్జున ఇంట్లోనే ఉంటుంది అన్న విషయం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కూడా అమల ఒక ఇంటర్వ్యూలో..టబు హైదరాబాద్ వస్తే చాలు తను ఇంట్లో చేసిన వంటలు బాగా తింటుందని.. తన వంటలంటే టబుకి చాలా ఇష్టమని.. కానీ డైటింగ్ చేస్తూ ఉండటం వల్ల చాలా తక్కువగా తింటుంది అని తెలిపారు.

ALSO READ: Actress Tabu: 50ల్లో కూడా చెక్కుచెదరని అందం.. టబూ అందానికి సినీ లోకం ఫిదా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×