E-Paper
Advertisement

Nagarjuna 100: నాగ్ సరసన ముగ్గురు బ్యూటీలు.. మన్మధుడు అనిపించుకున్నాడుగా!

Nagarjuna 100: నాగ్ సరసన ముగ్గురు బ్యూటీలు.. మన్మధుడు అనిపించుకున్నాడుగా!
Advertisement

Nagarjuna 100:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకున్న కింగ్ నాగార్జున (Nagarjuna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. తన తండ్రి పరంపర కొనసాగిస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. ఒకవైపు నిర్మాతగా.. మరొకవైపు హీరోగా కొనసాగుతున్న నాగార్జున.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. అంతేకాదు విలన్ గా కూడా సత్తా చాటిన నాగార్జున.. బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. బిజీగా గడిపేస్తున్నారు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిన నాగార్జున.. ఇప్పుడు తన రెండవ చిత్రంతో ఎలాగైనా సరే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

నాగార్జున 100వ సినిమా పైనే అందరి చూపు..

నాగార్జున 100వ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త విని అభిమానులు నిజంగా ఈయన మన్మధుడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా నాగార్జున కెరియర్లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతున్న నేపథ్యంలో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) , అక్కినేని అఖిల్ (Akkineni Akhil) గెస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే నాగార్జున భార్య అమలా(Amala Akkineni) కూడా ఇందులో ఒక గెస్ట్ పాత్ర పోషిస్తోందట.

నాగార్జున మూవీలో లక్కీలేడీ..

Advertisement

ఇకపోతే నాగార్జున లక్కీలేడీగా పేరు సొంతం చేసుకున్న టబు (Tabu) ఇందులో కీ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదివరకే వీళ్లిద్దరి కాంబినేషన్లో నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకున్నారు. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రాలేదు. అలా 27 ఏళ్లుగా ఆన్ స్క్రీన్ మీద కనిపించని టబు – నాగార్జున కాంబినేషన్ ఇప్పుడు నాగార్జున సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ:Telugu TV Anchors: నిజంగానే బుల్లితెర యాంకర్స్ కి అన్యాయం జరుగుతోందా.. వీరిని తొక్కేస్తోందెవరు?

నాగ్ 100వ మూవీలో ముగ్గురు భామలు..

Advertisement

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం.. అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సూపర్, రగడ, ఓం నమో వెంకటేశాయ, ఢమరుకం, డాన్ వంటి సినిమాలు వచ్చాయి. అలాగే బంగార్రాజు సినిమాలో కూడా అనుష్క – నాగార్జున మధ్య ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలా ఈ ఇద్దరి కాంబినేషన్స్ కి ఆన్ స్క్రీన్ మీద మంచి గుర్తింపు ఉండడంతో అనుష్కను కూడా ఇందులో తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరితోపాటు ప్రముఖ హీరోయిన్ సుస్మిత భట్ ని కూడా ఇందులో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాగార్జున 100వ సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలను రంగంలోకి దింపడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అంతేకాదు ఈ విషయం తెలిసి నాగార్జున ఎప్పటికీ మన్మధుడే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×