E-Paper
Advertisement

Taapsee Pannu: ప్రేక్షకుల బద్ధకం.. సినిమా ఫెయిల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ!

Taapsee Pannu: ప్రేక్షకుల బద్ధకం.. సినిమా ఫెయిల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ!
Advertisement

Taapsee Pannu:సినిమా అంటేనే కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించగలగాలి. అప్పుడే నటీనటులతో సంబంధం లేకుండా ఆ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటుందని ఇప్పటికే ఎన్నో చిన్న చిత్రాలు నిరూపించాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా సామాజిక అంశాలను ప్రధానంగా చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాలు అందర్నీ మెప్పించలేకపోతూ ఉండడం గమనార్హం. అయితే ఇలాంటి చిత్రాలు ఫెయిల్ అవ్వడానికి కారణం “ప్రేక్షకుల బద్ధకం” అంటూ ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను (Taapsee Pannu) చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సామాజిక అంశాలను తెరపై చూపించడానికి మళ్లీ సిద్ధమైన తాప్సీ..

విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘అస్సీ’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హాతో తాప్సీ చేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముల్క్, థప్పడ్ చిత్రాలు సామాజిక అంశాలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడు మళ్ళీ సామాజిక అంశాల మేళవింపుతో వస్తోంది అస్సీ. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అత్యాచార కేసులు, న్యాయవ్యవస్థలోని లోపాలను ఈ చిత్రం ద్వారా ప్రశ్నించబోతున్నారు. సినిమా విడుదలకు ఒక వారం ముందుగానే వివిధ నగరాలలో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా తాప్సి ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక నోట్ షేర్ చేసింది.

ప్రేక్షకుల బద్ధకం వల్ల సినిమా ఫెయిల్ అవ్వకూడదు..

Advertisement

అందులో..” హిందీ పరిశ్రమలో వాస్తవిక కథలు లేవని విమర్శిస్తూ ముసుగులో దాక్కోవద్దు. అద్భుతమైన కథలను థియేటర్లకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నప్పుడు.. ప్రేక్షకుల బద్ధకం వల్ల అవి ఫెయిల్ అవ్వకూడదు.. ప్రపంచ సినిమాతో మనం పోటీపడాలి అంటే.. ముందుగా మన దేశీ కథలను మనం ఆదరించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాము. మనం మౌనంగా ఉంటే భవిష్యత్తులో మంచి సినిమాలు రాకుండా పోతాయి. ప్రతిభ ఉన్న సినిమాలకు మన గొంతుక తోడవ్వాలి. అందుకే ఈ సినిమాలో మా కథనంపై మాకు నమ్మకం ఉంది. మీరు కూడా థియేటర్లకు వచ్చి మంచి సినిమాలకు మద్దతు ఇవ్వండి” అంటూ ఆమె కోరింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

స్పెషల్ స్క్రీనింగ్ లో బిజీగా..

ఇకపోతే భారతదేశంలో సగటున రోజుకు 80 అత్యాచార కేసులు నమోదవుతున్నాయనే భయంకరమైన వాస్తవం ఆధారంగా ఈ కోర్టు రూమ్ డ్రామా రూపొందించారు” అస్సీ.. ఆ రాత్రి ఆమె ఇంటికి చేరుకోలేదు” అనే క్యాప్షన్ తో విడుదలైన టీజర్ ఇప్పటికే గుండెలను పిండేస్తోంది. ఇందులో రావి అనే ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో తాప్సీ కనిపిస్తున్నారు. 20 ఫిబ్రవరి 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. మరి తాప్సీ అంత గట్టిగా ఈ సినిమా కథనంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే అటు ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×