E-Paper
Advertisement

Susmitha Konidela: చరణ్, నాన్న ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే.. సుస్మిత కొణిదెల కామెంట్స్ వైరల్!

Susmitha Konidela: చరణ్, నాన్న ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే.. సుస్మిత కొణిదెల కామెంట్స్ వైరల్!
Advertisement

Susmitha Konidela: సుస్మిత కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే ఇక ఇటీవల చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో సుస్మిత తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉమెన్స్ డే సందర్భంగా సుస్మిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నమ్మకమే గొప్ప బహుమతి..

ముఖ్యంగా మెగా ఇంట్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి అలాగే రామ్ చరణ్ చిరంజీవి నుంచి అందుకున్న కానుకల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ మా ఇంట్లో మహిళలను గుర్తించడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదని మా ఇంట్లో మహిళలకు ఎల్లప్పుడూ చాలా గౌరవం ఉంటుందని తెలిపారు. ఇక చరణ్ చిరంజీవి గారి నుంచి మీరు అందుకున్న బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు సుస్మిత సమాధానం చెబుతూ చాలావరకు బర్త్ డే ఉమెన్స్ డే వంటివి వస్తే తప్పకుండా గిఫ్ట్ ఇస్తారు కానీ వీటన్నిటికంటే చాలా బెస్ట్ గిఫ్ట్ అంటే “నమ్మకం” అని తెలిపారు.

గర్ల్స్ హాస్టల్ లో వార్డెన్..

Advertisement

చరణ్ నాన్న ఇద్దరూ నాపై పెట్టుకున్న నమ్మకమే నాకు గొప్ప కానుక అని తెలిపారు. వాళ్ళు లేకుండా నేనేపనైనా చేయగలననే నమ్మకం వారిలో ఉంది అంతకుమించి మరి ఎలాంటి కానుకలు అవసరం లేదని సుస్మిత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకు ఏదైనా కావాలి అంటే మేమున్నామని భరోసా వాళ్ళు ఇస్తారు కాకపోతే నేను ఆ పని చేయగలననే నమ్మకం వాళ్లకు ఉందని సుస్మిత తెలిపారు. ఇక ఇటీవల ఇంటికి వెళ్తే గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ లా ఉంది అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

సరదాగా మాట్లాడిన కాంట్రవర్సీ చేస్తారు..

Advertisement

చిరంజీవి గారు సరదాగా మాట్లాడిన సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీగా చూశారు దీనిపై మీ అభిప్రాయం వెంటనే ప్రశ్న ఎదురయింది. నిజానికి నాన్న ఇంట్లో పిల్లలందరితో చాలా సరదాగా ఉంటారు వారందరినీ ఆటపట్టిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు మనం సరదాగా మాట్లాడిన మాటలను కూడా ప్రేక్షకులు వారికి నచ్చినట్టు తీసుకుంటారని తెలిపారు. ఇంట్లో అయితే నాన్నగారు మా అమ్మాయిలతో చాలా సరదాగా ఉంటారని అలాగే మహిళలకు మంచి గౌరవం ఇస్తూ వారిని ప్రతి ఒక్క విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారంటూ సుస్మిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Big Tv Kissik Talks: తమిళ ఇండస్ట్రీ నన్ను వాడుకోలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×