E-Paper
Advertisement

Susmitha Konidela: చరణ్ నా టార్గెట్ కాదు..అది నా కోరిక మాత్రమే: సుస్మిత కొణిదెల

Susmitha Konidela: చరణ్ నా టార్గెట్ కాదు..అది నా కోరిక మాత్రమే: సుస్మిత కొణిదెల
Advertisement

Susmitha Konidela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన స్వస్తితో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఈయన ఇండస్ట్రీలో మంచి గుర్తుకు సంపాదించుకోవడంతో ఈయన వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మెగా హీరోలు మాత్రమే కాకుండా మెగా డాటర్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటిగా, నిర్మాతలుగా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.  ఇప్పటికే నిహారిక హీరోయిన్ గా,  నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా  చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత (Susmitha) కూడా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

నిర్మాతగా సుస్మిత సక్సెస్..

సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మితకు తమ ఫ్యామిలీ గురించి తన తమ్ముడు రామ్ చరణ్(Ram Charan) గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. చరణ్ తో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న ఎదురయింది.

చరణ్ తో సినిమా చేయడం నా కోరిక..

Advertisement

ఈ ప్రశ్నకు సుస్మిత సమాధానం చెబుతూ.. రామ్ చరణ్ తో కచ్చితంగా తన బ్యానర్ లో సినిమా ఉంటుందని తెలిపారు. చరణ్ తో సినిమా చేయడం నా టార్గెట్ కాదు కానీ, అది నా కోరిక. ఎప్పటికైనా నేను చరణ్ తో సినిమా చేస్తాను. చిరంజీవి గారు నాకు ఫాదర్ అయినప్పటికీ ఆయనతో సినిమా చేయటానికి నాకు ఇంతకాలం పట్టింది. నాన్న సినిమా కోసం మేము క్యూలో ఉన్నాము అలాగే చరణ్ సినిమా కోసం కూడా క్యూలో ఎదురు చూస్తున్నామని సుస్మిత తెలిపారు. ఇక చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నట్టు ఇప్పటివరకు తనకు కూడా చెప్పలేదని సుస్మిత తెలిపారు.

పెద్ది పనులలో బిజీగా చరణ్..

Advertisement

ప్రస్తుతం రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాల లైనప్ చూస్తే కనుక ఇప్పుడప్పుడే సుస్మితకు చరణ్ అవకాశం ఇచ్చేలాగా లేరనే చెప్పాలి. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్  అయ్యి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మార్చ్ 27 తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి అయితే వాయిదా గురించి ఇప్పటివరకు చిత్ర బృందం అధికారకంగా ఎక్కడ వెల్లడించలేదు.

Also Read: Soundarya: సౌందర్యది మిడిల్ క్లాస్ మెంటాలిటీ.. సౌందర్య మరణం పై డైరెక్టర్ ఎమోషనల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×