// // Suriya-Venky Atluri - సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. -->
E-Paper
Advertisement

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!
Advertisement

Suriya Venky Atluri MovUpdate: సార్, లక్కీ భాస్కర్‌ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు వెంకీ అట్లూరి. తెలుగు డైరెక్టర్‌ అయిన ఆయన తమిళ్‌ హీరోలతోనే సినిమా చేస్తున్నారు. వరుసగా మూడోసారి కూడా మరో తమిళ్‌ హీరోతో జతకట్టాడు. హీరో సూర్యతో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 46 (#Suriya 46) పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇది ద్విభాష చిత్రమే

Advertisement

అయితే ఇది పాన్‌ ఇండియా చిత్రమని తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి ఇందులో పలువురు తెలుగు, తమిళ్‌ నటీనటులు భాగమయ్యారు. అలాగే బాలీవుడ్‌ నటి రివీనా టాండన్‌ కూడా ఇందులో నటిస్తుండటంతో ఈ చిత్రం హిందీలో విడుదల అవుతుందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సూర్య చిత్రంతో వెంకీ అట్లూరి ఈ సారి సూర్య చిత్రంతో పాన్‌ ఇండియా సత్తా చాటబోతున్నాడని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సిసిమాపై వస్తున్న రూమర్స్‌ మూవీ టీం స్పందించింది. ఈ సినిమాని హిందీ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. “వెంకీ అట్లూరి, సూర్య చిత్రం హిందీతో రిలీజ్ చేయడం లేదు. తెలుగు, తమిళ్‌ ఆడియన్స్‌ కోసమే రూపొందుతున్న ద్విభాష చిత్రమిది.

28 రోజులకే ఓటీటీకి

ఇప్పటికే 55 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఎప్పటిలాగే థియేట్రికల్‌ విండో (థియేట్రికల్ రిలీజ్ డేట్, ఓటీటీ రిలీజ్ డేట్ మధ్య ఉండే టైం) కూడా 28 రోజులే” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. కాగా నిజానికి హిందీలో మూవీ రిలీజ్ అవ్వాలి అంటే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా నాలుగు వారాల్లోనే ఓటీటీకి వస్తుండటంతో ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం లేదట. కాబట్టి సూర్య–వెంకీ మూవీ కేవలం తెలుగు, తమిళ్‌లోనే విడుదల కానుంది. ఈ పోస్టు చూస్తుంటే ఇక ఈ చిత్రం కన్నడ, మలయాళం భాషలపై కూడా విడుదల అవ్వడం లేదని తేలిపోయింది.

రవీణ టాండన్‌ కీ రోల్‌

Advertisement

కాగా ఈ చిత్రంలో రవీణ టాండన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఆఫీషియల్‌ ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యున్‌ ఫోర్‌ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇందులో జీవి ప్రకాష్‌ సోదరి, ఏఆర్‌ రెహమాన్‌ మేనకోడలు భవానీ శ్రీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సార్‌, లక్కీ భాస్కర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌, ఇతర తారాగణంకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే టీం వెల్లడించనుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×