E-Paper
Advertisement

ఎట్టకేలకు విడుదలైన సూర్య ‘కరుప్పు’.. విజయ్‌ను ‘సీఎం’గా సంబోధించిన చిత్రంగా రికార్డ్!

ఎట్టకేలకు విడుదలైన సూర్య ‘కరుప్పు’.. విజయ్‌ను ‘సీఎం’గా సంబోధించిన చిత్రంగా రికార్డ్!
Advertisement

Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన అత్యంత ఆసక్తికర చిత్రం ‘కరుప్పు’ ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినమా విడుదలపై రకరకవాలుగా వార్తలు వినిపించాయి. అంతే కాకుండా అసలు విడుదల అవుతుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉండే అనేక ఆర్థిక ఇబ్బందులు, విడుదల జాప్యాల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-ఇళయరాజా మొదటి సినిమాకు 50 ఏళ్లు.. ‘మాస్ట్రో’ఎమోషనల్..

తొలి సినిమాగా..

Advertisement

ఈ సినిమా ప్రారంభంలో టైటిల్ కార్డ్స్ పడే సమయంలో నటుడు, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఒక సినిమాలో ఆయన్ని ‘ముఖ్యమంత్రి’ అని సంబోధించడం ఇదే మొదటిసారి. ఉదయం 9 గంటల షోలకు అనుమతి ఇచ్చినందుకు చిత్ర బృందం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ టైటిల్ కార్డ్ ప్రదర్శించింది.

ఎమోషనల్ అయిన దర్శకుడు..

నిజానికి ఈ సినిమా మే 14నే విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంస్థ ఎదుర్కొన్న కొన్ని ఆర్థిక చిక్కుల వల్ల ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి. ఈ పరిణామంతో దర్శకుడు ఆర్జే బాలాజీ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులకు క్షమాపణలు చెప్పారు. చివరకు సమస్యలన్నీ తొలగి మే 15న సినిమా గ్రాండ్‌గా విడుదలైంది.

Advertisement

చెన్నైలోని ప్రముఖ థియేటర్లలో జరిగిన మొదటి రోజు మొదటి షో (FDFS) వేడుకల్లో చిత్ర యూనిట్ పాల్గొంది. నటుడు కార్తీ, హీరోయిన్ త్రిష, దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా థియేటర్లకు వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూశారు. తన అన్న సూర్య సినిమా కోసం కార్తీ థియేటర్ వద్ద సందడి చేయడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Read also-స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. అబ్బా డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు..

ఈ సినిమా కోసం ‘ఆరు’ సినిమా తర్వాత దాదాపు 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూర్య, త్రిష జోడీ ఈ సినిమాలో మళ్లీ కలిసి నటించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఇందులో సూర్య ‘కరుప్పుసామి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమాకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సూర్య నటన, ఆర్జే బాలాజీ టేకింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×