E-Paper
Advertisement

Supritha: మా ఏడుపుల మీద డబ్బులు ఏరుకుంటున్నారు.. నెగిటివిటీ పై సుప్రీత కామెంట్స్!

Supritha: మా ఏడుపుల మీద డబ్బులు  ఏరుకుంటున్నారు.. నెగిటివిటీ పై సుప్రీత కామెంట్స్!
Advertisement

Supritha: సుప్రీత పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటివరకు ఈమె హీరోయిన్ గా ఒక సినిమా చేయకపోయినా కూడా సోషల్ మీడియా వేదికగా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటి సురేఖ వాణి(Surekha Vani) కుమార్తెగా అందరికీ సుపరిచితమైన సుప్రీత(Supritha) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. నిత్యం వారికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి రాకముందే భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక పలు ఆల్బమ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించిన సుప్రీత మొదటిసారి వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. తాజాగా ఈమె నటించిన అమరావతికి ఆహ్వానం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మొదటిసారి సుప్రీత హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ట్రోల్స్ పై స్పందించకపోవడమే మెడిసిన్..

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియచేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గురించి తన తల్లి గురించి వస్తున్న నెగెటివిటీ , ట్రోల్స్ గురించి ఈమె స్పందించారు. మామూలుగా ఒకరి గురించి ట్రోల్స్ వస్తే వెంటనే రియాక్ట్ అవుతూ వారికి సమాధానం చెబుతూ ఉంటారు కానీ సుప్రీత సురేఖ వాణి మాత్రం వారిపట్ల ఎన్నో విమర్శలు, నెగిటివిటీ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా స్పందించలేదు అయితే ఇలా స్పందించక పోవడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నించారు.

మా ఏడుపులపై డబ్బు సంపాదిస్తున్నారు..

Advertisement

ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ.. మన గురించి ఏదైనా ఒక నెగెటివిటీ వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడితే ఇంకా అటెన్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం ఆ విషయంపై రియాక్ట్ కాకుండా సైలెంట్ గా ఉంటే అక్కడితోనే ఆగిపోతుందని తెలిపారు. ఇదే మాకు మంచి మెడిసిన్ అంటూ సుప్రీత తెలియజేశారు. కొన్ని సంఘటనలు మమ్మల్ని చాలా బాధపెట్టాయి అయితే ఆ విషయాల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు ఎన్నో రకాలుగా రాశారు .ఇలా వీరంతా మా ఏడుపులపై పడి డబ్బులు ఏరుకుంటున్నారు అంటూ ఈమె కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చారు.

ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సురేఖ వాణి..

Advertisement

మా నవ్వుల గురించి కాకుండా మా ఏడుపుల గురించి మాట్లాడే వారికి అవకాశం ఇవ్వకూడదు అందుకనే మేము మా గురించి వచ్చే నెగెటివిటీ గురించి ఎక్కడ స్పందించలేదని, ఇలాంటి విషయాలు మమ్మల్ని మరింత బలంగా మార్చాయి అంటూ సుప్రీత ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సుప్రీత ప్రస్తుతం పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో తన తల్లి సురేఖవాణి ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల సురేఖ వాణి పెద్దగా సినిమాలలో కనిపించలేదని చెప్పాలి. అవకాశాలు రాక సురేఖ వాణి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా లేదంటే ఉద్దేశపూర్వకంగానే గ్యాప్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Sreeleela: మీ అమ్మాయి మాట నిలబెట్టుకుంది.. ఇది డిగ్రీ మాత్రమే కాదు.. శ్రీ లీల ఎమోషనల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×