E-Paper
Advertisement

Supritha: ఇది మా నాన్న కోరిక..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీత.. ఏం జరిగిందంటే?

Supritha: ఇది మా నాన్న కోరిక..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీత.. ఏం జరిగిందంటే?
Advertisement

Supritha: వెండితెరపై నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకానొక సమయంలో అక్క పిన్ని పాత్రలు అంటే టక్కున సురేఖవాణి అందరికీ గుర్తుకు వచ్చేది అంత అద్భుతంగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

అమరావతికి ఆహ్వానం..

ఇక సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలి అంటూ ఎంతో తాపత్రయపడ్డారు. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. అయితే త్వరలోనే ఈమె నటించిన అమరావతికి ఆహ్వానం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.

అమ్మా నాన్నల కోరిక నెరవేరిందంటూ..

Advertisement

ఇక ఈ సినిమా సుప్రీతకు తొలి సినిమా కావటం విశేషం ఈ సినిమా ద్వారా ఈమె మొదటిసారి వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరావతికి ఆహ్వానం అనే సినిమా తన మొదటి సినిమా అని, తాను మొదటిసారి వెండితెరపై కనిపించబోతున్నానని తెలిపారు. ఇలా నేను వెండితెరపై నటించడం అనేది మా అమ్మానాన్నల కోరిక అంటూ ఈమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇప్పటికి తన అమ్మ నాన్నల కోరిక నెరవేరబోతోందంటూ ఈమె తెలియజేశారు.

మరణించిన సుప్రీత తండ్రి..

Advertisement

ఇక సుప్రీత తల్లి సురేఖ వాణి ఇండస్ట్రీలో స్టార్ నటి అయినప్పటికీ తన అండదండలు లేకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం సుప్రీత ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక తన తండ్రి మాత్రం ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే అనారోగ్య సమస్యల కారణంగా సుప్రీత తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఇలా తన తండ్రి మరణించినప్పటికీ తన తండ్రి కోరికను నెరవేరుస్తున్న నేపథ్యంలోనే సుప్రీత ఎమోషనల్ అయ్యారు. ఈమె ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ అమర్ తో కలిసి చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాలు నటించబోతున్నారు ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Sudha Chandran: నటి సుధా చంద్రన్ కు వింత అనుభవం.. అర్ధరాత్రి గదిలో..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×