E-Paper
Advertisement

Supritha: నేను చేసింది తప్పే.. ఇకపై ఆ తప్పులు జరగవు పశ్చాత్తాపడుతున్న సుప్రీత..

Supritha: నేను చేసింది తప్పే.. ఇకపై ఆ తప్పులు జరగవు పశ్చాత్తాపడుతున్న సుప్రీత..
Advertisement

Supritha: సుప్రీత సురేఖ వాణి కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే సెలబ్రిటీగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సురేఖ వాణి(Surekha Vani) కూతురుగా సోషల్ మీడియాలో అందరికీ పరిచయమైన ఈమె సోషల్ మీడియా వేదికగా వీరికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ భారీగా డబ్బు సంపాదించారు. అయితే ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

సుప్రీత అమరావతికి ఆహ్వానం..

ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా సుప్రీత పై కూడా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈమె ఇప్పటికీ విచారణలకు హాజరవుతున్నారు. తాజాగా సుప్రీత నటించిన అమరావతికి ఆహ్వానం అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సుప్రీతకు బెట్టింగ్ ప్రమోట్ చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

బెట్టింగ్ యాప్స్ విషయంలో తప్పు చేశాను..

Advertisement

ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల గురించి ప్రశ్నలు ఎదురవడంతో సుప్రీత మాట్లాడుతూ నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇంత జరుగుతుంది అనే విషయం తెలియదు. నేను చేసింది తప్పే ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నానని తెలిపారు. నాకు బెట్టింగ్ యాప్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు అందుకే వాటి గురించి తెలుసుకోకుండా ప్రమోట్ చేశానని, అలా చేయటం తప్పని తెలిపారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక లాయర్ ఉన్నారని ఏదైనా ప్రమోషన్లు వస్తే వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ప్రమోషన్లను చేస్తున్నామని సుప్రీత తెలిపారు.

బెట్టింగ్ ప్రమోషన్ల పై ఉక్కు పాదం..

Advertisement

ఇక బెట్టింగ్ యాప్ లో భాగంగా తనపై కేసు నమోదు కావడంతో ఇప్పటికీ ఇంకా విచారణ కొనసాగుతుందని బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చామని తెలిపారు. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా కేవలం ఈమెపై మాత్రమే కాకుండా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఇతర యాంకర్లు యూట్యూబర్లపై కూడా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా ఎంతోమంది వీటికి బానిసలు అవుతూ పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ప్రాణాలను కూడా తీసుకుంటున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు బెట్టింగ్ యాప్స్ పై ఉక్కు పాదం మోపారు .ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు ఎవరైతే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేశారో వారిపై కూడా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Supritha: మా ఏడుపుల మీద డబ్బులు ఏరుకుంటున్నారు.. నెగిటివిటీ పై సుప్రీత కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×