E-Paper
Advertisement

Mass Jathara: మాస్ జాతర నుంచి సూపర్ డూపర్ సాంగ్ రిలీజ్.. అర్థం పర్థం లేదంటూ!

Mass Jathara: మాస్ జాతర నుంచి సూపర్ డూపర్ సాంగ్ రిలీజ్.. అర్థం పర్థం లేదంటూ!
Advertisement

Mass Jathara: రవితేజ(Ravi teja) హీరోగా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరొక మాస్ సాంగ్ విడుదల చేశారు. సూపర్ డూపర్ హిట్టు సాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించి ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇక ఈ పాటలో రవితేజ, శ్రీ లీల (Sreeleela)పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి.

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల..

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్ర బృదం ఈ పాటను తీర్చిదిద్దారు. భీమ్స్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, భీమ్స్, రోహిణి ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ పాటకు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల మరోసారి తన అద్భుతమైన స్టెప్పులతో డాన్స్ ఇరగదీశారు. ఇలా సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పోలీస్ యూనిఫామ్ వేస్తే సినిమా హిట్టే..

Advertisement

శ్రీ లీల రవితేజ హీరో హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత రవితేజ పలు సినిమాలలో నటించిన అనుకున్న విధంగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. దీంతో మాస్ జాతర సినిమా పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈయన పోలీస్ యూనిఫామ్ వేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ క్రమంలోనే మాస్ జాతర సినిమాలో కూడా ఈయన రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో హిట్ సెంటిమెంట్ కచ్చితంగా రిపీట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్మాత నాగ వంశీ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాకు మొదటిసారి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటి వరకు కథ రచయితగా పనిచేసిన భాను మొదటిసారి దర్శకుడిగా మారి మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కావడంతో ఒకరోజు ముందుగానే అనగా అక్టోబర్ 30వ తేదీ ప్రీమియర్లు కూడా ప్రసారం అవుతాయని నాగ వంశీ వెల్లడించారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Ramya Krishnan: ఐటమ్ సాంగ్స్ మళ్లీ చేయాలని ఉంది.. ఈ వయసులో ఆ కోరికలేంటీ బాబోయ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×