E-Paper
Advertisement

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !
Advertisement

Suneil Anand:దేవ్ ఆనంద్..ఇప్పటి తరానికి ఈ పేరు పెద్దగా తెలీకపోవచ్చు కాని 60s, 70s లో ఈయన క్రేజ్ అంతా ఇంతా కాదు.అలాంటి దేవ్ ఆనంద్  కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన దేవ్ ఆనంద్ పెద్ద కుమారుడు 70 ఏళ్ల సునీల్ ఆనంద్  గుండెపోటుతో కన్నుమూశారు. సునీల్ ఆనంద్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఒకప్పుడు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని సినిమాల్లోకి వచ్చిన ఆయన.. చివరి వరకు సినీ రంగంతో తన అనుబంధాన్ని కొనసాగించడం విశేషం.

భారత్‌కు ప్రయాణిస్తున్నసమయంలో

Advertisement

వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమెరికా నుంచి లండన్ మీదుగా భారత్‌కు ప్రయాణిస్తున్నసమయంలో సునీల్ ఆనంద్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.స్టంట్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించింది. డాక్టర్ల బృందం ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయిందని సమాచారం.అయితే సునీల్ ఆనంద్ ఏ హాస్పిటల్ లో అయితే చనిపోయాడో 2011లో ఇదే ఆస్పత్రిలో ఆయన తండ్రి దేవ్ ఆనంద్ కూడా కన్ను మూయడం కో ఇన్సిడెంట్ అనే చెప్పాలి.

సునీల్ ఆనంద్ విషయానికి వస్తే

Advertisement

ఇక సునీల్ ఆనంద్ విషయానికి వస్తే దేవ్ ఆనంద్, కల్పనా కార్తిక్ కి పెద్ద కొడుకుగా 1956 జూన్ 30న జన్మించారు.తండ్రి దేవ్ ఆనంద్ బాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో.. సునీల్ కూడా అదే రంగంలోకి అడుగుపెట్టారు.

ఇక 1984లో విడుదలైన ‘ఆనంద్ ఔర్ ఆనంద్’ సినిమాతో హీరోగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు సునీల్ ఆనంద్. ఈ సినిమాకు ఆయన తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంతో సునీల్‌కు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ.. తండ్రి స్థాయిలో స్టార్ హీరోగా ఎదగలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆయన హీరోగా రాణించలేక నటనకు దూరమయ్యారు.

అయితే సునీల్ ఆనంద్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పనిచేశారు. 1990లో వచ్చిన ‘మాస్టర్’ వంటి ప్రాజెక్టులతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే బాలీవుడ్‌లో కొత్త తరానికి చెందిన హీరోల రాక, మారుతున్న సినిమా ట్రెండ్ కారణంగా ఆయన కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.

దేవ్ ఆనంద్ సినిమాల విషయానికి వస్తే

ఇక ఆయన తండ్రి దేవ్ ఆనంద్ సినిమాల విషయానికి వస్తే గైడ్’ (1965), ‘జువెల్ థీఫ్’ (1967), ‘జానీ మేరా నామ్’ (1970), ‘హరే రామ హరే కృష్ణ’ (1971) వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో దేవ్ ఆనంద్ ప్రేక్షకుల హృదయాల్లో చెరపలేని స్థానాన్ని సంపాదించుకున్నాడు.ముఖ్యంగా  తన ప్రత్యేకమైన స్టైల్, రొమాంటిక్ ఇమేజ్‌తో ఆయనకు “ఎవర్‌గ్రీన్ హీరో” బిరుదు వచ్చింది కూడా .

ఇక సునీల్ ఆనంద్ మరణంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేవ్ ఆనంద్ కుటుంబానికి ఇది మరో తీరని లోటనే చెప్పాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×