// // Sigma Teaser - సందీప్ కిషన్ సిగ్మా టీజర్‌ వచ్చేసింది! -->
E-Paper
Advertisement

Sigma Teaser: విజయ్‌ తనయుడి తొలి డైరెక్షన్‌.. సిగ్మా టీజర్‌ వచ్చేసింది!

Sigma Teaser: విజయ్‌ తనయుడి తొలి డైరెక్షన్‌.. సిగ్మా టీజర్‌ వచ్చేసింది!
Advertisement

Sigma Telugu Teaser: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సిగ్మా. విజయ్‌ కొడుకు డెబ్యూ ఇస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్‌, తెలుగులో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌ వేగవంతం చేసిన మూవీ టీం తాజాగా టీజర్‌ రిలీజ్ చేసింది. 

టీజర్‌లో ఏముందంటే

Advertisement

క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ కూడా పెద్దపీట వేసినట్టు టీజర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. టీజర్‌ మొత్తం రేసింగ్‌, యాక్షయ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగింది. టీజర్‌లో విజువల్స్ కూడా వావ్‌ అనిపించేలా ఉన్నాయి. మంచోడు.. మహానుభావుడు.. చెడ్డోడు.. రాక్షసుడు… చూసే నీచుడిని బట్టి.. ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైన మారతాను అంటూ హీరో డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. 1:09 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజన్‌ ఆద్యాంతం ఆసక్తిగా ఉంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌గా సాగింది.

రాజు సుందరం కీలక పాత్రలో

Advertisement

ఇందులో సందీప్‌ కిషన్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించాడు. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, బీజీఎం టీజర్‌ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకవెళ్లింది. ఈ టీజర్‌ చూస్తుంటే విజయ్‌ తనయుడు జాసన్‌ సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమైపోతుంది. ఇక ఈ చిత్రంలో సందీప్‌ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Actor Shivaji: హీరోయిన్లపై అనుచిత కామెంట్స్‌.. క్షమాపణలు చెప్పిన శివాజీ

ఈసారైనా హిట్ కొడతాడా?

కాగా కొద్ది రోజులుగా సందీప్ కిషన్ పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన హీరోగా నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మైకెల్ అంటూ పాన్ ఇండియా సినిమాతో వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాలో దారుణంగా పరాజయమైంది. దీంతో హీరోగా కొంత గ్యాప్ తీసుకుని.. సినిమాల్లో సహా నటుడి, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమాలో సందీప్ కీ రోల్ పోషించాడు. ఈ మూవీ మంచి విజయం సాధిచింది. దీంతో అతడికి తమిళ్ మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్ తో ఇప్పుడు జాసన్ సంజయ్ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీ విజయం ఇటూ సందీప్ కి అటూ జాసన్ సంజయ్ కి చాలా ముఖ్యం. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది వచ్చే ఏడాది సమ్మర్ వరకు వేయిట్ చేయాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×