E-Paper
Advertisement

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్
Advertisement

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై  వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27 న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక పెద్ది సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ రెండు ప్లాప్ లను అందుకున్నాడు. ఆచార్య అయినా చిరు ఖాతాలోకి పోతుందేమో కానీ, గేమ్ ఛేంజర్ పరాజయం చరణ్ ఖాతాలోనే పడుతుంది. ఆ సినిమా వలన చరణ్ ఎన్ని ట్రోల్స్ బారిన పడ్డాడో అందరికీ తెల్సిందే. అందుకే ఎలాగైనా పెద్దితో  పెద్ద సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు.

Advertisement

అయితే అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది మేకింగ్ లో సుకుమార్ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  బుచ్చిబాబు.. సుకుమార్ స్కూల్ నుంచే వచ్చాడు. ఉప్పెన సినిమాతో బుచ్చి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. శిష్యుడు కోసం సుకుమార్ ఏం చెయ్యమన్నా చేస్తాడు. ఉప్పెన సమయంలో కూడా సుకుమార్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడని టాక్.

ఇక పెద్ది విషయంలో కూడా సుకుమార్ జోక్యం బాగా ఉందని తెలుస్తోంది. అయితే అది కూడా బుచ్చికి ఉపయోగపడేలానే ఉందని అంటున్నారు. ఉప్పెన సమయానికి ఎవరికి బుచ్చి మీద అంచనాలు లేవు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను తెరకెక్కించేశాడు. కానీ, బుచ్చి మీద చాలా ప్రెషర్ ఉంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో సినిమా అంటే.. ఇండస్ట్రీ మొత్తం అతని వైపే చూస్తోంది. ఏ చిన్న తప్పు జరిగినా అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తాయి. అందుకే ఎంతో ఆచితూచి బుచ్చి పెద్దిని ముందుకు సాగిస్తున్నాడు.

Advertisement

శిష్యుడు ప్రెషర్ పడడం చూసిన గురువు గారు.. భయపడకుండా ఉండడానికి తాను కూడా రంగంలోకి దిగాడట. ఎలాగూ ఈ సినిమాకు సుకుమార్ సంబంధం ఉంది. మైత్రీతో కలిసి సుకుమారే  పెద్ది సినిమాను పంపిణీ చేస్తున్నాడు. దీంతో రెండు కలిసి వస్తాయని ఈ సినిమా ప్రొడక్షన్ పనులను సుకుమార్ నే దగ్గరుండి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఏదైనా ఒక చేత్తో అయితే బావుంటుంది. ఇలా ఇన్ని చేతులు కలిపితే సినిమా మొత్తానికే పోతుంది అనే భయం వారిలో ఏర్పడుతుంది. దీంతో సుకుమార్ జోక్యం అవసరం లేదేమో అని అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×