// // Hey Bhagawan Trailer: సుహాస్ హే భగవాన్ ట్రైలర్ రిలీజ్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hey Bhagawan Trailer: సస్పెన్స్ హిలేరియస్ గా హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

Hey Bhagawan Trailer: సస్పెన్స్ హిలేరియస్ గా హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే?
Advertisement

Hey Bhagawan Trailer:క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు హీరో సుహాస్ (Suhas ). కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న ఈయన ఇప్పుడు హే భగవాన్ (Hey Bhagawan) అనే సినిమాతో మరోసారి నవ్వించడానికి సిద్ధం అయ్యారు. గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రైటర్ పద్మభూషణ్ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. సుదర్శన్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్ , ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు వంటి తారాగణం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తో పాటు వినోదాన్ని పంచే ఈ సినిమా 20 ఫిబ్రవరి 2026న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

సస్పెన్స్ తో పాటు హిలేరియస్ కామెడీ..

Advertisement

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. సస్పెన్స్ తో పాటు హిలేరియస్ గా ట్రైలర్ ను కట్ చేశారు. ముఖ్యంగా తన తండ్రి బిజినెస్ ను టేక్ ఓవర్ చేసి అభివృద్ధి చేస్తాను అని చెబుతున్న సుహాస్ కి.. అసలు తన తండ్రి ఏం బిజినెస్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలియకపోవడం గమనార్హం. మొన్న విడుదల చేసిన టీజర్ లో ఈ సస్పెన్స్ ను అలాగే ఉంచారు. కనీసం ట్రైలర్ లోనైనా రివీల్ చేస్తారు అనుకుంటే ట్రైలర్ లో కూడా అదే సస్పెన్స్ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే ఆ సస్పెన్స్ వీడి , వీకే నరేష్ చేస్తున్న ఆ బిజినెస్ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు సుహాస్ – శివానీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. వీటికి తోడు హర్షవర్ధన్ పెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వికే నరేష్ ఏ బిజినెస్ చేస్తున్నారో కొడుకుకు కూడా చెప్పకుండా మెయింటైన్ చేసిన సస్పెన్స్ కూడా ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఓవరాల్ గా మరోసారి నవ్వించడానికి సిద్ధమైపోయారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

also read:Peddi: పెద్దికి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా.. ఆ డేట్ ఫిక్స్ అయితే హిస్టరీ రిపీట్!

మళ్లీ జంటగా సుహాస్ – శివాని..

Advertisement

ఇక సుహాస్ శివాని నాగారం జంట విషయానికి వస్తే.. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వడంతో అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. అటు శివాని నాగారం కూడా ఇదివరకే లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అమాయకంగా కనిపిస్తూనే తన అల్లరితో మరోసారి అందరినీ నవ్వించడానికి సిద్ధమైన ఈ జంట ఈ హే భగవాన్ చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×