E-Paper
Advertisement

Sudheer GOAT Teaser : ఏం సుధీర్ అన్నా.. డబ్బింగ్ చెప్పే టైం కూడా లేదా??

Sudheer GOAT Teaser : ఏం సుధీర్ అన్నా.. డబ్బింగ్ చెప్పే టైం కూడా లేదా??
Advertisement

Sudheer GOAT Movie Teaser : కామెడీ షోలతో ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. ఆయనకు అవకాశాలు మాత్రం బానే వస్తున్నాయి. అలా వచ్చిన మూవీ గోట్. 2023లో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. దీనికి అంతటికి కారణం డైరెక్టర్ నరేష్ కుప్పిలి, హీరో సుడిగాలి సుధీర్ అనే కామెంట్స్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఆ వివాదం అలా కొనసాగుతున్న టైంలోనే.. ఈ గోట్ మూవీ నుంచి టీజర్‌ను లాంచ్ చేశారు నిర్మాతలు. అది ఎలా ఉందో ఇప్పుడీ ఆర్టికల్‌లో చూద్దాం.

Advertisement

సుడిగాలి సుధీర్ హీరోగా చేస్తున్న ఈ మూవీ టీజర్ కాసేపటి క్రితం నిర్మాతలు విడుదల చేశారు. టీజర్‌‌తోనే దాదాపు సినిమా స్టోరీ అంతా చెప్పే ప్రయత్నం చేశారు. అల్లరి చిల్లరగా తిరిగే హీరోకు క్రికెట్ అంటే పిచ్చి. అలా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే… ఇదే టైంలో డబ్బుల కోసం ఎలాంటి పని అయినా.. చేస్తాడు. ఆ క్రమంలో ఓ అమ్మాయిని పెళ్లికి ముందు కిడ్నాప్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో హీరోయిన్ వల్ల హీరో ఎదుర్కొనే ఇబ్బందులు సినిమాలో ఫన్నీగా చూపించినట్టు ఉన్నారు.

కథ వరకు వినడానికి బానే ఉంది. టీజర్‌ను కూడా బానే కట్ చేశారు. చూస్తే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. కానీ, సినిమాకు వెన్నుముక అయిన హీరో పాత్రనే తేడా కొడుతుంది. కారణం ఆ డబ్బింగ్.

Advertisement

టీజర్‌లో హీరో సుడిగాలి సుధీర్ చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. డబ్బింగ్ రూంలో కాకుండా.. ఆరుబయట మొబైల్ ఫోన్‌లో చెప్పినట్టు ఉన్నాయా డైలాగ్స్. దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే.. గోట్ మూవీ డబ్బింగ్ పనుల్లో సుడిగాలి సుధీర్ పాల్గొన్నట్టు లేదు.

ఒక సినిమా చేసిన తర్వాత.. అది రిలీజ్ అయ్యే వరకు అన్నీ బాధ్యతలు హీరోపైనే ఉంటాయి. కానీ, ఇలా డబ్బింగ్‌ను మధ్యలోనే వదిలేయాల్సిన అవసరం సుడిగాలి సుధీర్‌కు ఏం ఉంది..? ఇంతకీ నిజంగానే సుధీర్ డబ్బింగ్ చెప్పలేదా..? అనేది కూడా తెలియాల్సి ఉంది. అది తెలియాలంటే… సుధీర్ నోరువిప్పాల్సిందే.

Read More : Sudigali Sudheer GOAT : ప్రమోషన్స్‌కి హీరో డుమ్మా… నిర్మాతకు దిక్కెవరు?

ఇది పక్కన పెడితే.. డైరెక్టర్ నరేష్ కుప్పలి వల్ల… హీరో సుధీర్ గోట్ మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే దీనిపై నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా అసోసియేషన్‌ ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×