E-Paper
Advertisement

Sudha Chandran: నటి సుధా చంద్రన్ కు వింత అనుభవం.. అర్ధరాత్రి గదిలో..

Sudha Chandran: నటి సుధా చంద్రన్ కు వింత అనుభవం.. అర్ధరాత్రి గదిలో..
Advertisement

Sudha Chandran: ప్రముఖ నటి సుధా చంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధాచంద్రన్ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈమెకు సంబంధించి ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోలో భాగంగా సుధా చంద్రన్ తన ఒంట్లోకి ఎవరో ఆవహిస్తే పూనకంతో ఊగిపోయినట్టు ఊగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు సుధా చంద్రన్ కు ఏమైంది ఎందుకు అలా చేశారు అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.

సుధా చంద్రన్ వీడియో పై విమర్శలు..

ఇక ఈ వీడియో పై సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. సుధా చంద్రన్ ఆరోగ్య విషయంలో కూడా ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ఇలా ఈ వీడియో గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సుధా చంద్రన్ స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. తన వీడియో పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విమర్శలను ఈమె ఖండించడమే కాకుండా గతంలో తనకు జరిగిన ఒక వింత అనుభవాన్ని కూడా బయటపెట్టారు.

ఆరు నిమిషాల్లో నాలుగు లీటర్లు నీళ్లు..

Advertisement

నేను పూనకంతో ఊగిపోయిన సమయంలో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. కేవలం 6 నిమిషాలలో నాలుగు లీటర్లు నీళ్లు తాగినట్లు మా ఆయన చెబితేనే నాకు తెలిసింది సాధారణ వ్యక్తులు ఎవరు కూడా అలా తాగరు. ఆ సమయంలో అమ్మవారు నన్ను ఆవహించారనే విషయం నేను చెప్పను కానీ అమ్మవారి ఆశీస్సులు అయితే మాత్రం నాపై ఉన్నాయని సుధా చంద్రన్ తెలిపారు. గతంలో కూడా తాను ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని తెలిపారు. గుజరాత్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏదో తెలియని శక్తి నన్ను ఆవహించిందని తెలిపారు.

Advertisement

షూటింగ్ పూర్తి చేసుకుని గదికి వెళ్లాను నాతో పాటు అమ్మ కూడా ఉంది కానీ నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించడంతో మనసు మొత్తం అలజడిగా ఉందని నాలో ఏదో శక్తి అరుస్తూ నాలో ప్రవేశించింది. ఆ సమయంలో నేను కాళ్లు చేతులు కదపలేకపోయాను మాటలు కూడా మాట్లాడలేకపోయాను. ఇలాంటి సమయంలో నేను నాకెంతో ఇష్టమైన దేవుడిని ప్రార్థించాను. దేవుడిని ప్రార్థించిన తర్వాత నా చాతి మీద బరువు తగ్గిపోయింది, నాకు మాట్లాడటానికి గొంతు కూడా వచ్చిందని సుధా చంద్రన్ తెలిపారు. ఓసారి సౌత్ ఇండస్ట్రీకి షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని ఒక వ్యక్తి కాళ్లు చప్పుడు మహిళ ఏడుపులు వినిపించాయి. ఈ ఘటన గురించి నేను పక్కవారితో చెబితే ఈ ప్రాంతంలో అలాంటివే వినిపిస్తాయి అంటూ చెప్పారని ఈమె తనకు జరిగిన చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Murali Sharma:ఏంటీ.. ఈ లేడీ విలన్, నటుడు మురళి శర్మ భార్యనా, ఎవరూ ఊహించి ఉండరు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×