E-Paper
Advertisement

Star Heroine: అత్యంత విసుగుపుట్టించే సినిమా… ధురంధర్ 2 చూసి డబ్బులు వృధా చేసుకోవద్దండి… హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Star Heroine: అత్యంత విసుగుపుట్టించే సినిమా… ధురంధర్ 2 చూసి డబ్బులు వృధా చేసుకోవద్దండి… హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!
Advertisement

Star Heroine:రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ సినిమా ధురంధర్ 2 ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌కే 500 కోట్ల మార్క్ చేరే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే పుష్ప 2..బాహుబలి, జవాన్ వంటి పెద్ద సినిమాల రికార్డులను కూడా ఈ మూవీ సవాల్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

సినిమా విడుదలైన తర్వాత పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ పనితనం, రణ్‌వీర్ సింగ్ నటనపై మంచి స్పందన వచ్చింది. అయితే అందరి అభిప్రాయం ఒకేలా ఉండదు. ప్రముఖ నటి దివ్య స్పందన (రమ్య) మాత్రం ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమా..!

Advertisement

సినిమా చూసిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, “ఇప్పుడే ధురంధర్ 2 చూశాను. ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమా. అత్యంత విసుగు పుట్టించిన సినిమా. చూస్తుంటే ఒక పొడవైన, బోరింగ్ పాఠ్యపుస్తకం చదివినట్టు అనిపించింది” అని అన్నారు.

థియేటర్‌లో టైమ్, డబ్బు వృథా చేసుకోవద్దు..!

అంతేకాకుండా, “థియేటర్‌లో టైమ్, డబ్బు వృథా చేసుకోవద్దు. పాజ్ చేసి ఫోన్ స్క్రోల్ చేస్తూ జీవితంపై ఆలోచించే పరిస్థితి వస్తుంది” అని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా టెక్నికల్ అంశాలపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్..ఏదీ సరిగా లేదు” అని పేర్కొన్నారు.

Advertisement

సినిమాలో హింసాత్మక సన్నివేశాలపై కూడా ఆమె మండిపడ్డారు. “ఇది సినిమా కాదు, హింసను ఎంత రకాలుగా చూపించవచ్చో చెప్పే విజువల్ ప్రదర్శనలా ఉంది” అని వ్యాఖ్యానించారు. అలాగే హీరో పాత్రపై కూడా సెటైర్లు వేస్తూ, “రణ్‌వీర్ ఏం మోస్తున్నాడు? నాకు కనిపించింది అతని జుట్టే” అని అన్నారు.

చివరగా ఆమె సినిమా మొత్తాన్ని సమీక్షిస్తూ, “ధురంధర్ 2 పూర్తిగా నిరాశపరిచింది. ఇది బోరింగ్ కంటెంట్ మాత్రమే” అని తేల్చేశారు. అలాగే దర్శకుడికి సూచిస్తూ, “అతి జాతీయత, ప్రచార ఆర్భాటం ఇప్పుడు అవుట్‌డేటెడ్” అని అన్నారు.

ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..రణ్‌వీర్ అభిమానులు దివ్య స్పందనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. భారీ విజయంతో పాటు వివాదాన్ని కూడా తెచ్చుకున్న సినిమా గా ధురంధర్ 2 నిలిచింది.

ALSO READ: Dhurandhar 2: ధురంధర్ సినిమా సగం కలెక్షన్స్‌కు కారణం ఆ నటుడే అంట.. హీరో మాత్రం కాదు!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×