E-Paper
Advertisement

ఫ్యాన్స్ కి షాక్.. పెళ్లిపై శృతిహాసన్ కీలక నిర్ణయం!

ఫ్యాన్స్ కి షాక్.. పెళ్లిపై శృతిహాసన్ కీలక నిర్ణయం!
Advertisement

Shruti Haasan: ఈ ఏడాది బ్యాచిలర్స్ అందరూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంటే.. తమ అభిమాన హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులకు ఊహించని నిరాశ ఎదురయింది అనే చెప్పాలి. తాజాగా శృతిహాసన్ తన పెళ్లిపై తీసుకున్న కీలక నిర్ణయం అభిమానులకు మింగుడు పడడం లేదు. మరి పెళ్లి గురించి అసలు శృతిహాసన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు ఆ కఠిన నిర్ణయం తీసుకుంది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

ప్రేమ , పెళ్లి పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో ‘ఐరన్ లెగ్’ అని పిలిపించుకొని.. ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నటి మాత్రమే కాదు సింగర్ గా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు, వీడియోలు పంచుకునే ఈమె.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం నెటిజన్లకు గట్టిగానే పని చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారంలో ఎవరైనా వేలు పెడితే కచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆరుసార్లు ప్రేమించా.. అందుకే ఈ నిర్ణయం.

Advertisement

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ..” నా జీవితంలో ఇప్పటివరకు నేను ఆరుసార్లు ప్రేమించాను. అయితే అవన్నీ కూడా గాయాలతోనే ముగిసాయి.. అందుకే మళ్ళీ ప్రేమ అనే పేరు ఎత్తకుండా ప్రశాంతత బాట పట్టాను. అందుకే ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇకపై తాను సింగిలే “అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతమందితో ప్రేమాయణం, బ్రేకప్ అంటే మళ్ళీ మళ్ళీ తేరుకునే శక్తి ఆ మనసుకు ఉండాలి కదా.. అందుకే ప్రశాంతత బాట పట్టింది శృతిహాసన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా శృతిహాసన్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

also read:అలాంటి సమస్యతో ఇండస్ట్రీకి దూరం అయిన స్టార్ సింగర్.. రంగంలోకి రెహమాన్ సోదరి!

శృతిహాసన్ ప్రేమ, బ్రేకప్ విషయానికి వస్తే..

Advertisement

గతంలో ఈమె లండన్ కి చెందిన ప్రముఖ నటుడు మైఖేల్ కోర్సలే తో సహజీవనం చేసింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నాళ్లకే విడిపోయింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో డూడుల్ ఆర్టిస్టు శాంతన్ హజారికా తో ప్రేమలో పడింది. నాలుగేళ్లపాటు సహజీవనం కొనసాగించింది. కానీ ఇద్దరి మధ్య వ్యక్తిగత అభిప్రాయ బేధాలు రావడంతో 2024లో విడిపోయింది.. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. వివాహ వ్యవస్థ అంటే తనకు భయం అని, అందుకే ఇకపై తన దృష్టి కెరియర్ పైనే పెడతానని చెప్పుకొచ్చింది

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×