E-Paper
Advertisement

The Paradise: రెండు భాగాలుగా నాని ది ప్యారడైజ్.. స్క్రిప్ట్ కూడా రెడీ?

The Paradise: రెండు భాగాలుగా నాని ది ప్యారడైజ్.. స్క్రిప్ట్ కూడా రెడీ?
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని(Nani) ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. టైర్ 2 హీరోలలో స్టార్ గా కొనసాగుతున్న నాని ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. నాని త్వరలోనే ది ప్యారడైజ్ (The Paradise)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

జడల పాత్రలో నాని..

ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకు తెలియజేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం వాటిని ఖండిస్తూ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలియజేశారు. ఈ సినిమాలో నాని జడల అనే పాత్రలో విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడమే కాకుండా నాని కెరియర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సీక్వెల్ గా ది ప్యారడైజ్..

Advertisement

ఇటీవల కాలంలో సినిమాలు పెద్ద ఎత్తున ఫ్రాంచైజీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని, శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela) కాంబినేషన్లో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటికే సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని మొదటి భాగం అద్భుతమైన క్లైమాక్స్ తో ముగిస్తూ దానికి కొనసాగింపుగా సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా సీక్వెల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు..

Advertisement

ఈ సినిమాలో నానికి జోడిగా సోనాలి కులకర్ణి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించగా మరొక హీరోయిన్ గా కాయదు లోహర్  కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరొక నటుడిని పరిచయం చేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేశారు . బిర్యానీ అనే పాత్రలో నటుడు సంపూర్ణేష్ బాబు నటిస్తున్నట్లు చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×