E-Paper
Advertisement

Sreeleela: శ్రీ లీలతో స్టార్ హీరో రొమాన్స్.. హీరో పై సీరియస్ అయిన హీరోయిన్ తల్లి?

Sreeleela: శ్రీ లీలతో స్టార్ హీరో రొమాన్స్.. హీరో పై సీరియస్ అయిన హీరోయిన్ తల్లి?
Advertisement

Sreeleela: డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. శ్రీ లీల కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

కార్తీక్ ఆర్యన్ తో గొడవ..

శ్రీ లీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి తూ మేరి జిందగీ హై అనే సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో పెద్ద గొడవ జరిగిందని శ్రీ లీల తల్లి స్వర్ణలత హీరో కార్తీక్ ఆర్యన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. శ్రీ లీల తల్లితో హీరోకి గొడవ జరగడం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సీన్ చేయాల్సి రావడంతో కార్తీక్ ఆర్యన్ ఎక్కువ టేక్స్ తీసుకున్నారట. ఈ విధంగా ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో శ్రీ లీల చాలా ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది.

కావాలనే రీటేక్స్..

Advertisement

నటుడు కార్తీక్ ఆర్యన్ ఉద్దేశపూర్వకంగానే ఈ సన్నివేశంలో ఎక్కువ టేక్స్ తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీ లీల తల్లి స్వర్ణలత సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలను కట్ చేయాలని కోరినట్టు తెలుస్తుంది. ఇలా ఈ విషయంలోనే వీరిమధ్య గొడవలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక కార్తీక్ ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం చేస్తున్నారనే వాదన కూడా వినపడుతుంది.

కార్తీక్ ఆర్యన్ తో రిలేషన్ లో శ్రీలీల..

Advertisement

ఇకపోతే శ్రీ లీల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కార్తీక్ ఆర్యన్ తో సినిమాకు కమిట్ అవడంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ పలు సందర్భాలలో జంటగా బయట కనిపించిన నేపథ్యంలో రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని బయట పెట్టలేదు అంటూ వార్తలు వచ్చాయి . ఈ వార్తలకు అనుగుణంగానే ఈమె కార్తీక్ ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపించడం కార్తీక్ ఆర్యన్ తల్లి మా ఇంటికి రాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుంది అని మాట్లాడటంతో వీరి రిలేషన్ కన్ఫర్మ్ అనే అభిమానులు భావిస్తున్నారు. ఇక శ్రీ లీల హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వృత్తిపరంగా ఆమె వైద్యురాలు అనే సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీ లీల తన ఎంబిబిఎస్ కూడా పూర్తి చేశారు.

Also Read: Jayasudha on Pawan Kalyan : యాటిట్యూడ్ ఏం మారలేదు… పవన్‌పై జయసుధ వైరల్ కామెంట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×