E-Paper
Advertisement

తొలిసారి పెదవి విప్పిన మెగా కూతురు శ్రీజ.. ఎమోషనల్ వీడియో వైరల్!

తొలిసారి పెదవి విప్పిన మెగా కూతురు శ్రీజ.. ఎమోషనల్ వీడియో వైరల్!
Advertisement

Sreeja Konidela : శ్రీజ కొణిదెల….చిరంజీవి చిన్న కూతురిగా లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే ఈమె చాలా ఏళ్ల తర్వాత తన పర్సనల్ లైఫ్ గురించి, తను అనుభవించిన అనుభవించిన తీవ్ర మానసిక క్షోభపై తొలిసారిగా బహిరంగంగా స్పందించడంతో ఒక్కసారిగా వార్తల్లో హైలెట్ అయ్యింది.అవును… ఎప్పుడూ మీడియాకు దూరంగా, సైలెంట్‌గా ఉండే ఆమె, ఈసారి తన లైఫ్‌లోని చీకటి రోజులు, ఆ వేదన నుంచి తాను ఎలా బయటపడిందో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో వరుస వీడియోలను రిలీజ్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆ వీడియోలో శ్రీజ ఎంతో ఎమోషనల్ అవుతూ తన మనసులోని బాధని పంచుకున్నారు. ఒకానొక దశలో నా జీవితంలో జరిగిన తప్పులే నా గుర్తింపు అనుకున్నానని, అసలు నాకే ఎందుకిలా జరుగుతోంది, నేనేం పాపం చేశానని ఒకదాని వెంట ఒకటి ఇన్ని కష్టాలు వస్తున్నాయంటూ తీవ్ర మానసిక వేదన అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో తనను తాను ఒక బాధితురాలిగా (Victim) చూసుకుంటూ డిప్రెషన్‌కు గురయ్యానని తెలిపారు.

సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్’ అనే కోర్సును పూర్తి చేసిన శ్రీజ 

Advertisement

అయితే ఈ సుడిగుండం నుండి బయటపడటానికి ఆమెకు ‘శ్రీ పీఠం’ (Sacred Paths) వ్యవస్థాపకురాలు అనురాధా రమేష్ ఎంతో తోడ్పడ్డారు. వారి ఆధ్వర్యంలో శ్రీజ సుమారు 15 నెలల పాటు ‘సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్’ అనే ప్రత్యేక కోర్సును పూర్తి చేశారు. ఈ ప్రయాణమే తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని, నా జీవితాన్ని నేనే నిర్మించుకోగలను అనే సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ పోస్ట్‌కు మెగా పీస్ నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ‘మై సూపర్ ఉమెన్’ అంటూ కామెంట్ చేయడంతో ఈ సిస్టర్ బాండింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

ఇక శ్రీజ వ్యక్తిగత విషయానికి వస్తే, 2007 అక్టోబర్ నెలలో కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుని అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఈ దంపతులకు 2008లో నివృతి అనే కుమార్తె జన్మించింది. అయితే వీరి వైవాహిక బంధం ఎంతో కాలం సాగలేదు. 2011 మార్చిలో శ్రీజ తన భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో, సుదీర్ఘ కోర్టు విచారణల అనంతరం 2014లో అధికారికంగా విడాకులు తీసుకుని కూతురితో కలిసి పుట్టింటికి వచ్చేసారు.

ఆ తర్వాత మెగా కుటుంబం శ్రీజ జీవితాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు చొరవ తీసుకుంది. ఈ క్రమంలోనే 2016 మార్చిలో శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన కల్యాణ్ దేవ్‌ను రెండవ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బెంగళూరులో అత్యంత వైభవంగా జరిగింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో కల్యాణ్ దేవ్ ‘విజేత’ (2018) అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

విపరీతంగా ట్రెండ్ అవుతున్న శ్రీజ వీడియోస్ 

అదే ఏడాది అంటే 2018 డిసెంబర్‌లో ఈ దంపతులకు నవిష్క అనే కుమార్తె జన్మించింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, దురదృష్టవశాత్తూ వీరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో 2022 నాటికి ఈ బంధం కూడా ముగిసిపోయింది. ఇలా వరుసగా రెండుసార్లు వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న శ్రీజ, ఇప్పుడు అన్నింటినీ అధిగమించి ఒక పవర్‌ఫుల్ ఉమెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం ఈ మోటివేషనల్ వీడియోలు  విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

also read :రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×