E-Paper
Advertisement

బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!

బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!
Advertisement

Sonali bendre:అందం,అభినయంతో వెండితెరపై మ్యాజిక్ చేసి మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి కుర్రకారు హృదయాలను దోచుకుంది సోనాలి బింద్రే. మన్మధుడు, మురారీ , ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ ఇలా తెలుగులో ఎన్నో క్లాసిక్ హిట్లను సొంతం చేసుకున్న ఈమె.. సడన్గా ఇండస్ట్రీకి దూరం అయింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకే జీవితాన్ని కేటాయించిన సోనాలి.. సడన్గా 2018లో స్టేజ్ 4 క్యాన్సర్ బారిన పడింది. ప్రాణాపాయ స్థితి నుండి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం,తో అభిమానుల ఆశీర్వాదంతో కఠిన పరిస్థితుల నుంచి కోలుకొని క్యాన్సర్ ను జయించి మళ్లీ తన కెరీర్ ను తిరిగి ప్రారంభించింది.

తల్లి పాత్రలతో దూసుకుపోతున్న సోనాలి..

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను ఎంచుకుంది సోనాలి బింద్రే. అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్’తో పాటు ‘ ది బ్రోకెన్’ న్యూస్ వంటి వెబ్ సిరీస్ లలో తల్లి పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి మునుపటి వైభవాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈమె.. తాజాగా బాలీవుడ్ ను విమర్శిస్తూ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సరదా కార్ రైడ్ లో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై విమర్శలు గుప్పించింది సోనాలి బింద్రే.

టాలీవుడ్ పై ప్రశంసలు..

Advertisement

ఇక ఇందులో భాగంగానే సోనాలి బింద్రే మాట్లాడుతూ..” బాలీవుడ్ కంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అంటూ ఆమె కొనియాడింది. తెలుగులో స్క్రిప్టులు ముందే సిద్ధంగా ఉంటాయి. తెలుగు సినిమాల బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాలీవుడ్ కంటే బాగుంటాయి. షూటింగ్ సెట్స్ లో లభించే ఆహారం కూడా అద్భుతంగా ఉంటుంది” అంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమపై ఆమె ప్రశంసలు కురిపించారు. మొత్తానికైతే బాలీవుడ్ కంటే టాలీవుడ్ బాగుంటుంది అంటూ తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు సైతం సోనాలి బింద్రేకు మద్దతు పలుకుతున్నారు. మరి సోనాలి బింద్రే కోరుకుంటున్నట్టు మంచి అవకాశాలు తెలుగులో లభించాలని అభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.

ALSO READ:చిన్నారి అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి..

Advertisement

ఇదిలా ఉండగా.. మరొకవైపు క్యాన్సర్ తర్వాత పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు. తనను తాను మానసికంగా, ఉత్సాహంగా ఉంచే పాత్రలను మాత్రమే ఆమె ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన ఈమె.. ఇప్పుడు తన నటనతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర అయినా పర్వాలేదు మెప్పించడానికి అని చెబుతోంది. ఇక త్వరలోనే తన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×