E-Paper
Advertisement

Son Of Movie Trailer : సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’ టీజర్ ఎలా ఉందంటే?.. రిలీజ్ ఎప్పుడంటే?..

Son Of Movie Trailer : సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’ టీజర్ ఎలా ఉందంటే?.. రిలీజ్ ఎప్పుడంటే?..
Advertisement

Son Of Movie Trailer : సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో.. ప్ర‌ముక రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది.

Read also-Ravi Teja: డిజాస్టర్‌ల తర్వాత కిక్ కాంబో రిపీట్… వర్కౌట్ అవుతుందా?

Advertisement

హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాను. భాస్కర భట్ల గారితోనే ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం. అప్పుడే నాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశాడు. రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కిట్టు మాకు గొప్ప విజువల్స్‌ను ఇచ్చాడు. శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

Read also-Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?

Advertisement

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. ఇది నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సతీష్ గారికి థాంక్స్. ఇది నాకు సుదీర్ఘమైన ప్రయాణం. మా హీరో సాయి గారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. రిషి మ్యూజిక్, కిట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. భాస్కర భట్ల మాట్లాడుతూ .. ‘సాయి నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం. నచ్చిన టెక్నిషియన్లను తీసుకుని సాయి ఈ మూవీని గొప్పగా నిర్మించాడు. ఇందులో రెండు మంచి పాటల్ని రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌ రిషిని నేను పరిచయం చేసినట్టు అయింది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×