E-Paper
Advertisement

Sobhita: ఉగాది పచ్చడి వండలేదు.. సమంతకు శోభిత పంచ్..?

Sobhita: ఉగాది పచ్చడి వండలేదు.. సమంతకు శోభిత పంచ్..?
Advertisement

Sobhita: ఉగాది రోజు.. ఒకపక్క సమంత, మరోపక్క శోభిత ఉగాది పచ్చడి గురించి చేసిన వ్యాఖ్యలు.. తెగ వైరస్ అవుతున్నాయి . ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సాధారణంగా ఉదిగాది రోజు ఉగాది పచ్చడి వైరల్ అయితే.. ఈసారి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో.. ఉగాది పచ్చడికి సంబంధించిన.. రెండు వీడియోలు ఒకేసారి వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఉగాది పచ్చడి చేసిన సమంత..!

మొదటగా సమంత ఒక వీడియో కాల్ ద్వారా అందరినీ ఆకట్టుకుంది. సుమతో మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్.. తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉగాది పచ్చడి తాను స్వయంగా తయారు చేశానని చెప్పింది. “నాకు వంట అంతగా రాదు, కానీ ఈసారి ఉగాది పచ్చడి చేశాను” అంటూ సరదాగా మాట్లాడింది. అంతేకాకుండా ఆమె ఉగాది పచ్చడి చేశాను అని చెప్పగానే ఆమె భర్త కూడా నువ్వు చేసావా అని ఆశ్చర్యపోయారు. ఇక ఉగాది పచ్చడి చేసే విధానం సమంతకు సుమ నేర్పించింది. మొత్తం పైన ఇలా తనకు వంట అసలు రాదు అని కానీ ఉగాది పచ్చడి చేశాను అని ఆ ఇంటర్వ్యూ మొత్తం చెప్పకు వచ్చింది సమంత.

ఉగాది పచ్చడి గురించి శోభిత..!

Advertisement

ఇక మరోవైపు గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో శోభిత చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ ఈవెంట్‌కు నాగచైతన్య, నాగార్జున, అమలతో కలిసి శోభిత హాజరైంది. యాంకర్లు సుమ, ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ కార్యక్రమాన్ని ఎంటర్‌టైన్ చేశారు. ఈ సమయంలో ఉగాది పచ్చడి గురించి ప్రశ్న రాగానే శోభిత “నేను పచ్చడి వండలేదు, కేవలం చేసాను అంతే” అని చెప్పింది.

ఆమె ఈ సమాధానం అక్కడున్న వారిని నవ్వించింది. అయితే అక్కడ మాటికి ప్రదీప్.. సుమాను శోభిత ను ఉగాది పచ్చడి గురించి అడగమని అనడం అలానే.. ఉగాది పచ్చడి గురించి చెప్పిందే శోభిత మొహం చూసారా ఎలా వెలిగిపోయిందో అని ప్రదీప్ అన్నడం వల్ల.. ఇది ఏదో సమంత వీడియోలో చెప్పిన మాటలతో పోల్చుతూ మాట్లాడినట్లు ఉంది అంటూ..నెటిజన్స్ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని సరదాగా తీసుకుంటుంటే, మరికొందరు ఇది సమంతకు పంచ్‌లా అనిపించిందని అంటున్నారు.

Advertisement

అయితే ఈ రెండు సంఘటనలు పూర్తిగా వినోదం కోసం జరిగినవే అని చెప్పాలి. ఎక్కడా ఎలాంటి వివాదం లేకుండా అభిమానులు ఈ వీడియోలను ఆస్వాదిస్తున్నారు. కొందరు మాత్రం సమంతకు ఇది శోభిత పంచ్..అంటూ ఏవేవో కామెంట్లు పెడుతున్నారు. ఉగాది రోజున ఇలా చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్‌గా మారడం విశేషమే.

ఇక గతంలో శోభిత భర్త నాగచైతన్య సమంతను ప్రేమించే పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ALSO READ: Gaddar awards 2026: రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదు..చేతల సీఎం: డైరెక్టర్ గుణశేఖర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×