// // Sobhita - దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌! -->
E-Paper
Advertisement

Sobhita: బొట్టు ఎక్కడ?, ఇది దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌!

Sobhita: బొట్టు ఎక్కడ?, ఇది దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌!
Advertisement

Sobhita-Naga Chaitanya Diwali Celebration: దీపావళి పండగ సందర్భంగా దేశమంత సెలబ్రేషన్స్‌లో మునిగింది. సినీ సెలబ్రేషన్స్‌ కూడా దివాళీని ఘనంగా జరుపుకున్నారు. పండుగ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ శుభకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అక్కినేని కోడల శోభిత కూడా దీపావళి సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇది. దీంతో భర్త నాగ చైతన్యతో కలిసి ఈ పండగను ఘనంగా జరుపుకుంది. ఇంట్లో దీపాలు వెలిగించి.. భర్తతో సంతోషంగా గడిపిన క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంది.

పెళ్లి తర్వాత తొలి దీపావళి

Advertisement

ఫ్యాన్స్‌, నెటిజన్స్‌కి విషెస్‌ తెలుపుతూ ఈ సందర్భంగా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో చై, శోభితలు చూడముచ్చటగా కనిపించాడు. ఇక పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ కావడంతో ఇద్దరు కలిసి సంతోషంగా తొలి దీపావళికి ఆహ్వానం పలికారు. ఓ వైపు ఈ ఫోటోలను ఫ్యాన్స్‌ లైక్‌ చేస్తుంటే యాంటి ఫ్యాన్స్‌ మాత్రం ట్రోల్‌ మొదలెట్టారు. నాగ చైతన్య–శోభిత ఫోటోలు ఎప్పుడోచ్చిన కూడా యాంటి ఫ్యాన్స్‌ విపరీతమైన నెగిటివిటీని చూపిస్తారనే విషయం తెలిసిందే. సమంత విషయంలో వీరిద్దరి టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తాజాగా ఈ దీపావళి ఫోటో శోభిత అవతారం చూసి నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.

శోభిత–చై ఫోటోలు వైరల్

అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. తెలుగు ప్రజలంత లక్ష్మి అమ్మవారి పూజ చేసుకుని ఈ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ పండగ అంటే అంత సంప్రదాయ లుక్‌లోకి మారిపోతారు. తెలుగు వారు బొట్టు, చీర కట్టి లక్ష్మి అమ్మావారిన పూజించి ఈ పర్వదినాన సంప్రదాయంగా కనిపిస్తారు. కానీ శోభిత దీనికి డిఫరెంట్‌ గా కనిపించింది. వెల్వెట్‌ పర్పుల్‌ సూట్‌ లో బన్‌ వేసి.. ట్రెండీగా కనిపించింది. ఇది ఫెస్టివ్‌ డ్రెస్‌ అయినా.. తెలుగు సంప్రదాయంలో మాత్రం లేదు. పైగా బొట్టు కూడా పెట్టుకోలేదు. నాగ చైతన్య మాత్రం ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ట్రెడిషనల్‌గా కనిపించాడు. కానీ, శోభిత చీరకట్టుకోకుండ సల్వార్‌ సూట్‌ వేసింది. ఆమె లుక్‌ చూడటానికి తెలుగు సంప్రదాయంలా లేకపోవడంతో ఆమె డ్రెస్సింగ్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బొట్టు, చీర ఎక్కడ?

Advertisement

ఫోటోలో ఇద్దరు చాలా క్యూట్‌ గా ఉన్నారు.. కానీ, శోభిత బొట్టు పెట్టి చీరకడితే ఇంకా బాగుండేదని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘శోభిత.. దీపావళి జరుపుకుంటుందా? రంజాన్‌ జరుపుకుంటుందా? బొట్టు లేదు, చీరకట్టలేదు. పైగా అచ్చమైన బ్రహ్మీన్‌ కుటుంబానికి చెందింది. కానీ తెలుగు సంప్రదాయానే మరిచిపోయింది‘ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు అది తన ఇష్టం.. వారి హ్యాపీగా ఉండనివ్వరా అంటూ ఫ్యాన్స్‌ మాత్రం శోభితకు సపోర్టు చేస్తున్నారు. ఏదేమైన పెళ్లి తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళికి ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా గతేడాది డిసెంబర్‌లో శోభిత, నాగ చైతన్యలు వివాహ బంధంలోకి అడుగుపట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో బంధువులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×