E-Paper
Advertisement

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!
Advertisement

Sobhita Dhulipala:శోభితా ధూళిపాళ…అక్కినేని వారి కోడలన్న సంగతి అందరికీ తెల్సిందే.కానీ అంతే కాదు నేను అంతకు మించి అంటూ తన స్టైల్‌తో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఫ్యాషన్ అంటే కేవలం కాస్ట్లీ బట్టలే కాదు, కల్చర్, ట్రెడిషన్, ఆర్ట్ అంటూ మరోసారి ప్రూవ్ చేసింది.

ఇండియా కౌచర్ వీక్ 2026 వేదికపై శోభితా ఇచ్చిన అపియరెన్స్ ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ లోనే కాదు, మూవీ లవర్స్ మధ్య కూడా సరికొత్త డిబేట్ కి దారి తీసింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సమయంలో “ఇది ర్యాంప్ వాక్ కాదు… ఒక కళాఖండం నడిచొస్తున్నట్టుంది” అంటూ శోభిత ని ఆకాశానికి ఎత్తేస్తునారు నెటిజన్లు.

Advertisement

భారతీయ కళని గుర్తు చేసేలా

ఈసారి శోభితా కోసం రూపొందించిన కాన్సెప్ట్ పూర్తిగా భారతీయ కళని గుర్తు చేసేలా ఉందనడం లో ఆశ్చర్యం లేదు. పదకొండో శతాబ్దానికి చెందిన కాంస్య శిల్పాల సౌందర్యాన్ని ఆధారంగా తీసుకుని ఆమె లుక్‌ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా ఫ్యాషన్ షోలలో కనిపించే షోస్టాపర్ పాత్రకు భిన్నంగా, కళాకారులకు, శిల్పులకు, కథకులకు స్ఫూర్తినిచ్చే శాశ్వత సౌందర్యానికి ప్రతిరూపంగా ఆమెను ఆవిష్కరించడం విశేషం. అందుకే ఆమె నడకలో కూడా హడావుడి కంటే హుందాతనం ఎక్కువగా కనిపించిందన్నది ప్యాషన్ పండితుల మాట.

Advertisement

ప్రతీ ఆభరణం ఒక ప్రత్యేక అర్థం 

ర్యాంప్‌పై ఆమె నడుస్తుంటే అది కేవలం ఒక ఫ్యాషన్ షోలా కాకుండా, భారతీయ శృంగార సంప్రదాయాన్ని గుర్తు చేసే ఒక కళాత్మక ప్రదర్శనలా కనిపించిందనడం లో సందేహమే లేదు.ఇక ఆమె వేసుకున్న ప్రతి ఆభరణాలకి ఒక ప్రత్యేక అర్థాన్ని తెలియజేసేలా డిజైన్ చేయడం ఈ ప్రెజెంటేషన్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చిందనే చెప్పాలి.

ఈ లుక్ కోసం హెయిర్ స్టైలింగ్ నుంచి జ్యువెలరీ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. సంప్రదాయ శైలిని ఆధునిక ఫ్యాషన్‌తో కలిపి రూపొందించిన ఈ కాన్సెప్ట్‌కు ప్రముఖ బ్యూటీ బ్రాండ్ కూడా భాగస్వామిగా నిలవడం విశేషం.

కెరీర్ విషయానికి వస్తే

ఇక శోభితా ధూళిపాళ కెరీర్ విషయానికి వస్తే మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె బాలీవుడ్‌లో ‘రామన్ రాఘవ్ 2.0’సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తర్వాత ‘కాలాకండి’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో తన నటనతో ప్రశంసలు అందుకుంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమాతో మరింత దగ్గరైంది. ఆ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్ – 1’, ‘పొన్నియన్ సెల్వన్ – 2’ చిత్రాల్లో ‘వానతి’ పాత్రలో కనిపించి పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అలాగే హాలీవుడ్‌లో రూపొందిన ‘మంకీ మ్యాన్’ చిత్రంలో కూడా నటించి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటడం విశేషం.

Tags

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×