E-Paper
Advertisement

Sobhita dhulipala: అక్కినేని ఫ్యామిలీపై మనసులో మాట బయటపెట్టిన శోభిత?

Sobhita dhulipala: అక్కినేని ఫ్యామిలీపై మనసులో మాట బయటపెట్టిన శోభిత?
Advertisement

Sobhita dhulipala:శోభిత ధూళిపాళ (Sobhita dhulipala).. ఎప్పుడైతే నాగచైతన్య (Naga Chaitanya) ప్రేమలో పడిందో అప్పటి నుంచే ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఎవరు ఈమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అని తెలుసుకోవడానికి చాలామంది అక్కినేని అభిమానులు తెగ గూగుల్ సెర్చ్ చేసేసారు . అలా ఆ ఏడాది అత్యధికంగా గూగుల్ చేయబడ్డ హీరోయిన్గా నెంబర్ వన్ జాబితాను దక్కించుకుంది శోభిత ధూళిపాళ. నాగచైతన్య తో వివాహం జరగకముందు అసలు ఎవరో కూడా తెలియని చాలామంది ఎప్పుడైతే నాగచైతన్యకు భార్యగా, అక్కినేని కోడలిగా మారిందో ఒక్కసారిగా ఈమెను ఓన్ చేసుకున్నారు. అలాంటి ఈమె తొలిసారి తన కెరియర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ పై తన మనసులో మాట బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది శోభిత.

అక్కినేని ఫ్యామిలీతో శోభిత అభిప్రాయం..

నాగచైతన్యతో వివాహం జరిగి ఏడాదికి పైగా కావస్తున్న నేపథ్యంలో పరిశ్రమలో తన పట్ల చూసే దృక్పథంలో పెద్దగా మార్పు ఏమి రాలేదని ఆమె తెలిపింది. “నేను నా కెరియర్ ప్రారంభం నుండి నేటి వరకు ప్రతి అడుగు నా స్వతంత్ర పోరాటమే. ఒక గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన మాట వాస్తవమే. కానీ నా పని, కుటుంబం ఎప్పుడు వేరు వేరు. నా అత్తమామలను నేను కేవలం కుటుంబ సభ్యులుగా మాత్రమే చూస్తాను. కానీ ఇండస్ట్రీ వ్యక్తులుగా కాదు..” అంటూ స్పష్టం చేసింది శోభిత ధూళిపాళ. ఇకపోతే పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టినా.. వారిని మాత్రం కుటుంబ సభ్యులుగా స్వీకరించానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం శోభిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగుతాను..

Advertisement

అలాగే సెకండ్ ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ..” కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళా క్యారెక్టర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అలాగే ఆ పాత్ర మంచిదా చెడ్డదా అనే దానికంటే.. ఆ పాత్రకు కథలో ఎంత ప్రాముఖ్యం ఉంది అనేదే చూస్తాను. అందుకే సినిమాలలో కేవలం గ్లామర్ గా కనిపించడానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వను. ఇప్పటికే ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్తులో కూడా నా సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్తాను” అంటూ శోభిత తన మనసులో మాటను బయటపెట్టింది. ఏది ఏమైనా అక్కినేని లాంటి బడా కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆ నేపథ్యాన్ని ఎప్పటికీ ఉపయోగించుకోనని.. స్వతంత్రంగానే ముందుకు వెళ్తానని చెప్పి మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ విషయం తెలిసి అక్కినేని అభిమానులు కూడా శోభిత పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

also read:OTT: ఓటీటీలో సరికొత్త సంచలనం.. ఇంకా పట్టాలెక్కని సినిమా హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!

శోభిత కెరియర్..

Advertisement

శోభిత కెరియర్ విషయానికి వస్తే.. వైజాగ్ కి చెందిన ఈమె 2013 లో మిస్ ఇండియా పోటీలలో రెండవ స్థానం దక్కించుకుంది. తర్వాత మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని ఆకట్టుకుంది.. తెలుగులో అడవి శేషు హీరోగా నటించిన గూఢచారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. మేజర్ సినిమాతో ఆకట్టుకుంది. ఇక చివరిగా చీకటిలో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×