E-Paper
Advertisement

Mumbai: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. రంగంలోకి పోలీసులు, ముంబైలో హై అలర్ట్!

Mumbai: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. రంగంలోకి పోలీసులు,  ముంబైలో హై అలర్ట్!
Advertisement

Mumbai: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్‌శెట్టి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆరు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లోనే ఉన్నారా? లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని ముంబై పోలీసులు తెలిపారు.

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు

Advertisement

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటికి వద్ద శనివారం అర్ధరాత్రి 12.30 నుండి ఒంటి మధ్యప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంది. దుండగులు ఆరు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటన గురించి తెలియగానే జుహు పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు.

కాల్పుల సమయంలో డైరెక్టర్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది తెలియరాలేదు. పరిస్థితి గమనించిన ముంబై పోలీసులు రోహిత్ శెట్టి ఉన్న టవర్ చుట్టూ భారీగా భద్రత మోహరించారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. అయితే కాల్పులు జరిపిన దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎటువైపు వెళ్లారు? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్‌ని మరొక టీమ పరిశీలన చేస్తోంది.  కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు, ముంబైలో హై అలర్ట్!

బాలీవుడ్ నటీనటుల ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో సల్మాన్ ఖాన్ తోపాటు పలువురు నటుల ఇంటి వద్ద ఆ తరహా ఘటనలు జరిగాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు బాధ్యత వహించినట్టు ప్రకటించింది. అంతేకాదు సల్మాన్ సన్నిహితుడిగా పేరుగాంచిన 66 ఏళ్ల మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొంది.

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌కు నటుడితో చాలా కాలంగా వైరం ఉంది. తాజాగా రోహిత్ శెట్టి టార్గెట్ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాల్పుల ఘటన వెనుక అండర్ వరల్డ్ గ్యాంగ్‌ హస్తం ఉందా?బెదిరించేందుకు ఈ విధంగా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కాల్పుల ఘటనపై రోహిత్ శెట్టి కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ALSO READ: బిర్యానీ పై సింగర్ చిత్ర కామెంట్స్.. ఆమె ఫేవరెట్ ఫుడ్ ఇదే..

నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముంబై సిటీలో గాలింపు తీవ్రతరం చేశారు. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి. జమీన్ మూవీ ద్వారా అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వెనుక దిరిగి చూడలేదు. ఏడాదికి ఒక సినిమా చొప్పున తీసుకుంటూ వచ్చాడు. కెరీర్‌లో దాదాపు 17 నిమిషాలు చేశాడు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోల్‌మాల్, సింగం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×