// // Siva Karthikeyan- హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత -->
E-Paper
Advertisement

Siva Karthikeyan: రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. ఆ నిర్మాతపై ఫిర్యాదు

Siva Karthikeyan: రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. ఆ నిర్మాతపై ఫిర్యాదు
Advertisement

Siva karthikeyan Remuneration Issue: ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలో శివ కార్తికేయన్‌ ఒకరు. ఈ మధ్య ఆయన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి. కమర్షియల్‌ గానూ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో కోలీవుడ్‌లో ఆయన మార్కెట్‌ బాగా పెరిగింది. అలాగే రెమ్యునరేషన్‌గా భారీ పెంచాడు ఈ హీరో. ఇటీవల కాలంగా శివ కార్తికేయన్‌ పారితోషికం తమిళ మీడియాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళంలో స్టార్‌ హీరోగా ఉన్న శివకార్తికేయన్‌ ఇప్పుడు రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లు ఎక్కాడు. తన సినిమా నిర్మాత డబ్బులు ఇవ్వకుండ తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ మద్రాస్‌ హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహరంలో కోర్టులో ఉంది.

మిస్టర్ లోకల్ మూవీ లొల్లి

Advertisement

ఇంతకి అసలువిషయం ఏంటి? శివ కార్తికేయన్‌కి రెమ్యునరేషన్‌ ఎగ్గొట్టిన ఆ నిర్మాత ఎవరో ఇక్కడ చూద్దాం. కాగా శివ కార్తికేయన్‌ హీరోగా 2019లో నటించిన చిత్రం ‘మిస్టర్‌ లోకల్‌’. నిర్మాత జ్ఞానవేల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు గానూ హీరోకి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్‌ ఒప్పందం కుదిరింది. అయితే , జ్ఞానవేల్ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

రూ. 4 కోట్లు బకాయి

తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు విడుదల కాకుండా నిలుపాలని శివకార్తికేయన్ చెన్నై కోర్టుని కోరాడు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ రాజా హీరోలు సూర్య, కార్తీలకు దగ్గర బంధువనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బొల్తా కొట్టాయి. వీటితో జ్ఞానవేల్‌ తీవ్ర నష్టాలను చూశాడు. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి.

Advertisement

Also Read: Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?

ఈ వివాదాల మధ్య నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కుతాడనే ఇప్పుడ కోలీవుడ్‌ ఆసక్తిని సంతరించుకుది. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి. గతంలోనూ ఆర్థిక లావాదేవిల విషయంలో జ్ఞానవేల్‌ రాజా కోర్టు చూట్టు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం ఈయన నిర‍్మించిన కొత్త సినిమా ‘వా వాతియర్’ సరిగ్గా రిలీజ్‌కి కొన్ని గంటలు ముందు కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే మూవీ స్టేకి కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర ఆయన రూ. 20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఈ సినిమాపై స్టే విధించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×