E-Paper
Advertisement

Parasakthi Censor Cuts: పరాశక్తికి సెన్సార్ కష్టాలు..ఏకంగా 23 కోతలు.. విడుదల కష్టమేనా?

Parasakthi Censor Cuts: పరాశక్తికి సెన్సార్ కష్టాలు..ఏకంగా 23 కోతలు.. విడుదల కష్టమేనా?
Advertisement

Parasakthi Censor Cuts: శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరాశక్తి(Parasakthi). శివ కార్తికేయన్ (Sivakarthikeyan) శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమా విడుదలకు మరొక రోజు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న, చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై ఎక్కడ అధికారకంగా స్పందించలేదు. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ రాని నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతుందని తెలుస్తోంది.

హిందీ వ్యతిరేక ఉద్యమం..

పరాశక్తి సినిమా 1965వ సంవత్సరంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసిన అనంతరం విడుదలకు అడ్డు వేశారని తెలుస్తోంది. పరాశక్తి సినిమాకు సెన్సార్ సభ్యులు ఏకంగా 23 కోతలు విధిస్తూ అభ్యంతరాలు తెలియజేశారని సమాచారం. ఈ సినిమా హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తుంది.

ఆ సన్నివేశాలను తొలగించాల్సిందే?

Advertisement

ఈ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించడం లేదా వాటిని సవరించాలని సెన్సార్ బోర్డు వెల్లడించినట్టు తెలుస్తుంది . పరాశక్తి సినిమా విషయంలో సెన్సార్ అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) ముంబైలోని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీని సంప్రదించారని తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు విధించిన ఈ కట్స్ సినిమా కథనంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని సుధా కొంగర ముంబైలోని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందు తన ఆలోచనను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాని నేపథ్యంలో విడుదల విషయంలో కూడా అభిమానులు అయోమయంలో పడ్డారు.

సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేనా?

Advertisement

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి రేపటిలోగా క్లియరెన్స్ వస్తే యధావిధిగా ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదలవుతుంది లేదంటే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు విజయ్ నటించిన జననాయగన్ సినిమా రేపు విడుదల కావలసి ఉండగా ఈ సినిమాకు సెన్సార్ తో పాటు ఫైనాన్స్ సమస్యలు కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక ఈ సినిమా తదుపరి విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

Also Read; Sobhita Dhulipala: పెళ్లి తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని పెద్ద కోడలు.. పోస్ట్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×