E-Paper
Advertisement

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా సీత!

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా సీత!
Advertisement

Bellamkonda Srinivas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత రెండు సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన ఈయన.. తన ప్రేయసి కావ్య రెడ్డితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా బుధవారం అనగా ఏప్రిల్ 29 2026న రాత్రి 11:05 గంటల సమయంలో సాయి శ్రీనివాస్ కావ్యా రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక ఈ జంట చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఈ జంటను చూసి అభిమానులు, నెటిజన్ లు ఫిదా అయిపోయారు. చూడ చక్కని జంట అంటూ ప్రశంసలు కురిపించారు.

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రిసెప్షన్..

తిరుమలలో వివాహం చేసుకున్న ఈ జంట.. సినీ ప్రముఖులు , రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్ వేదికగా గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించారు. రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు . రిసెప్షన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నాగ చైతన్య, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, గోపీచంద్, శ్రీకాంత్ , తరుణ్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నిర్మాత దిల్ రాజు, ఆలీతోపాటు రాజకీయ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు వచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకలో చిరంజీవి, మోహన్ బాబు వంటి దిగ్గజాలకు బెల్లంకొండ కుటుంబం పాదాభివందనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన క్షణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్పెషల్ అట్రాక్షన్ గా కాజల్..

Advertisement

ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్ వేడుకల్లో కాజల్ అగర్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన భర్త గౌతమ్ కిచ్లూ తో కలసి సందడి చేసింది. ఎంబ్రాయిడరీ లెహంగా శారీలో మెరిసిన కాజల్ అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. గతంలో సాయి శ్రీనివాస్ , కాజల్ కాంబినేషన్లో సీత, కవచం వంటి సినిమాలు వచ్చాయి.

ALSO READ:ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. అది మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే?

భార్యను ఇంటర్వ్యూస్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

Advertisement

ఇదిలా ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలను పంచుకుంటూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశారు. తన భార్య నిప్పు, పవర్ఫుల్ అంటూ అభివర్ణించడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ జంట క్యూట్గా కనిపిస్తూ అందరి మనసులను గెలుచుకుంటుంది. ప్రస్తుతం ఈ పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు..

చివరిగా కిష్కింధపురి, భైరవం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు టైసన్ నాయుడు, హైందవం అనే రెండు చిత్రాలలో నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్లలో పాల్గొని వీటితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×