E-Paper
Advertisement

Jani Master -Chinmayi: జానీ మాస్టర్ పై కేసు.. మరో  ట్వీట్ వేసిన చిన్మయి..మాస్టర్ భార్య కూడా!

Jani Master -Chinmayi: జానీ మాస్టర్ పై కేసు.. మరో  ట్వీట్ వేసిన చిన్మయి..మాస్టర్ భార్య కూడా!
Advertisement

Jani Master -Chinamyi: జానీ మాస్టర్ ఇటీవల తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భాగంగా ఈయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యనకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు ఇవ్వడం పట్ల చిన్మయి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఈమె ఇదే విషయం గురించి పోస్ట్ చేస్తూ కర్మ సిద్ధాంతం కచ్చితంగా వెంటాడుతుంది అంటూ మాట్లాడారు. అయితే తాజాగా మరో సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు.

పెద్ద వారితో సంబంధాలు..

ఈ సందర్భంగా చిన్మయి స్పందిస్తూ.. జానీ మాస్టర్ కేసు చాలా సంక్లిష్టమైనదని చిన్మయి తెలిపారు. జానీ మాస్టర్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అందుకు ఆమె ఒప్పుకోలేదని తనని బెదిరించినట్టు చిన్మయి తెలిపారు. అయితే ఇద్దరి ఏకాభిప్రాయంతోనే ఇలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని చిన్మయి తెలియజేశారు. ఒక అడల్ట్ వ్యక్తి మైనర్ బాలికతో ఏ విధమైనటువంటి రిలేషన్ పెట్టుకోకూడదనే విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు. అయితే జానీ మాస్టర్ కు పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలు ఉన్నాయని అందుకే బాధిత మహిళలకు ఏమాత్రం న్యాయం జరగలేదని తెలిపారు.

జానీ మాస్టర్ భార్య నుంచి ఫోన్..

Advertisement

ఇలా జానీ మాస్టర్ విషయం గురించి తాను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడొద్దని చెబుతున్నారు. ఈ విషయంలో నిర్దోషులుగా బయటపడే ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారని, అందుకే ఈ విషయం గురించి మాట్లాడిన ప్రతిసారి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ చిన్మయి తెలిపారు.. ఇక ఈ కేసు నుంచి జానీ మాస్టర్ కనుక బయటపడితే ఆయనకు వరుస అవార్డులు వచ్చి చేరుతాయని ఈ సందర్భంగా చిన్మయి జానీ మాస్టర్ చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

చిన్మయి మహిళల గురించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రశ్నిస్తూ బాధితులకు మద్దతుగా నిలుస్తుంటారు. ఇలా తరచూ ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడంతో పలువురు ఈమె ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో భారీగా విమర్శలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ చిన్మయి మాత్రం వెనకడుగు వేయకుండా మహిళలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల తన పట్ల సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను ఉద్దేశించి ఈమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఈమె మాత్రం జానీ మాస్టర్ విషయంలో వెనకడుగు వేయలేదని చెప్పాలి.

Also Read: Rashmika : ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయం వేస్తుంది.. పీరియడ్ ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×