E-Paper
Advertisement

Shruti Haasan : కొంతమంది సెట్స్ లో మైక్స్ విసిరేస్తారు, కానీ లోకేష్ ఎలా ఉంటాడంటే?

Shruti Haasan : కొంతమంది సెట్స్ లో మైక్స్ విసిరేస్తారు, కానీ లోకేష్ ఎలా ఉంటాడంటే?
Advertisement

Shruti Haasan : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అంటే ఖచ్చితంగా వినిపించే పేరు శృతిహాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్, తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో పరిచయమైంది. కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద అప్పట్లో విపరీతమైన అంచనాలు ఉండేవి.

ఈ సినిమాను చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చే ప్రమోట్ చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, మగధీర సినిమాలో కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉండబోతుంది అన్నట్లు మాట్లాడారు. దానికి తోడు రాఘవేంద్రరావు కొడుకు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు వేరే స్థాయికి వెళ్లిపోయారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుంది శృతిహాసన్.

Advertisement

కొందరు సెట్స్ లో మైక్ విసిరేస్తారు

ఒక సినిమాను డైరెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ డైరెక్టర్ కి చాలా ఓపిక ఉండాలి. తాను రాసుకున్న కథను వెండితెరపై ఆవిష్కరించే ప్రాసెస్ లో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఆ తరుణంలో కొంతమంది దర్శకులు కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు. కొంతమంది చేతిలో ఉన్న మైక్స్ కూడా విసిరేస్తుంటారు. ఈ తరుణంలో దర్శకుడు లోకేష్ ఎలా ఉంటాడో తెలిపింది శృతిహాసన్. లోకేష్ కనకరాజ్ సెట్ లో చాలా సైలెంట్ గా, క్లామ్ గా తన పని తాను పర్ఫెక్ట్ గా చేసుకొని పోతారట. లోకేష్ తీసే సినిమాలు అలా ఉంటాయి కానీ లోకేష్ చాలా కూల్ గా వర్క్ చేస్తుంటారు అంటూ చెప్పింది శృతిహాసన్. లోకేష్ ప్లానింగ్ గురించి కూడా నాగార్జున మాట్లాడుతూ బడ్జెట్ మిగిల్చి మరి షూటింగ్ ఫినిష్ చేశాడు అంటూ చెప్పారు.

Advertisement

వరుస సక్సెస్ఫుల్ సినిమాలు

మా నగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ఖైదీ సినిమా నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది. ఇక్కడితో వేగంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు లోకేష్. ఇక సీనియర్ హీరో కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో మంచి సక్సెస్ అందించాడు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ పొందుతుంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ భారీ సాయం… ఎన్ని లక్షలు ఇచ్చాడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×