// // Shruti Haasan - ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసినట్టుగా ఇటుక గోడ.. -->
E-Paper
Advertisement

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..
Advertisement

Shruti Haasan Home Tour: బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఫరా ఖాన్‌ సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి తరచూ సెలబ్రిటీల వీడియోలు షేర్‌ చేస్తోంది. ఇప్పటి వరకు ఆమె ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి వాళ్ల హోంటూర్‌ చేస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మృణాల్ ఠాకూర్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ కపూర్‌, సోనూ సూద్‌ వంటి ప్రముఖు హోంటూర్‌ చేసింది. అంతేకాదు ప్రత్యేకంగా వారి కోసం స్పెషల్ వంటకం వండి మరి తీసుకువెళుతుంది. ఇందుకోసం తన ఇంటి వంటమనిషిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. తన వంటమనిషితో కలిసి సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి వారి హోంటూర్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఫరా స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లింది. తన కోసం స్పెషల్‌గా మటన్‌ కర్రీ తీసుకుని వెళ్లింది.

Advertisement

శ్రుతి హాసన్ హోంటూర్

కాగా శ్రుతిని తన వంటమనిషికి పరిచయం చేస్తూ.. తను మద్రాస్‌ అమ్మాయి.. కానీ ముంబైలో ఉంటుంది. ఆమె తండ్రి మద్రాస్‌.. ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలోనే పెద్ద హీరో అంటూ హైప్‌ ఇచ్చింది. ఆ తర్వాత మనం కమల్‌ హాసన్‌ కూతురు శ్రుతి హాసన్‌ ఇంటికి వచ్చామంటూ హోంటూర్‌ ఎవరిదో ముందే రివీల్ చేసింది. అనంతరం ఇంటి కాలింగ్‌ బెల్‌ కొట్టగానే శ్రుతీ బయటకు వచ్చింది. డోర్‌ తీసి ఫరాను చూడాగానే సర్‌ప్రైజ్‌ అయ్యింది. అనంతరం ఆమె ఇతను మా ఇంటి వంటమనిషి.. ఈ మటన్‌ నీ కోసమే స్పెషల్‌గా వండాడు అంటూ పరిచయం చేసింది. దీనికి శ్రుతీ మీ యూట్యూబ్‌ ఛానల్‌కి ఈయనేగా సెలబ్రిటీ అంటూ శ్రుతి చమత్కరించింది. ఆ తర్వాత శ్రుతీ ఇల్లు చూసి..వావ్‌ నీ ఇల్లు ఏంటీ ఇలా ఉంది అని ఫరా కామెంట్స్‌ చేసింది.

Advertisement

దీనికి శ్రుతీ స్పందిస్తూ.. అవును.. డబ్బులు లేక కనీసం ఇంటికి పెయింట్‌ కూడా వేయలేదు.. అందరు ఏంటీ ఇల్లు ఇలా ఉందంటున్నారు అంటూ ఫన్నీగా చెప్పింది.  దీనికి ఫరా వావ్‌ నాకు చాలా బాగా నచ్చింది. ఇండ్ట్రీయల్‌ ఫీల్‌ ఇస్తుందని చెప్పింది. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి ఇది.. గర్ల్స్‌ హోమ్ అంటూ తన స్నేహితులను పరిచయం చేసింది. అనంతరం తన ఇంట్లోని ఉన్న వస్తువులు, బొమ్మలు అన్ని చూపిస్తూ వాటి స్పెషాలిటీని వివరించింది. ఈ సందర్భంగా ఫరా ఖాన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. దర్శకురాలిగా తను పరియం అవుతూ తీసిన ‘మై హోనా‘ మూవీకి తన తండ్రి కమల్‌ హాసన్‌ ఫస్ట్ ఛాయిస్‌ అని చెప్పింది.

కోట్ల ఆస్తి.. సాధాసిదా ఇంట్లో నివాసం..

షారుక్‌ కంటే ముందు తన తండ్రి కమల్‌నే ఈ సినిమా అనుకున్నానని, ఇందుకోసం చెన్నై వెళ్లి ఆయన ఆఫీసు, ఇల్లు చూట్టు తిరగానని చెప్పింది.  కానీ, ఆయనకు ఉన్న కమిట్మెంట్స్‌ కారణంగా ఈ సినిమా రిజెక్ట్‌ చేసినట్టు చెప్పింది. ఈ సందర్భంగా శ్రుతి సౌత్‌ ఇండియన్‌ ఫేమస్‌ ఫుడ్‌ సాంబార్‌ చేసి ఫరాకు రుచిచూపించింది. అయితే శ్రుతి ఇల్లు చూసి అంత షాక్‌ అవుతున్నారు. చూడటానికి ఇల్లు రంగురంగుల పెయింటింగ్ లేదు. గోడలు,ఫ్లోరా అంతా ఒకే కలర్ తో ఉంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. లోప ఇల్లు మొత్తం మాత్రం యూనిక్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. 

Also Read: Film Workers Strike : నిర్మాతలు కాస్త తగ్గండి… క్లాస్ పీకిన మంత్రి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×