E-Paper
Advertisement

Shivani Nagaram: తిరుమల శ్రీవారి 15 నిమిషాల దర్శనంపై శివానీ ఇచ్చిన క్లారిటీ ఇదే!

Shivani Nagaram: తిరుమల శ్రీవారి 15 నిమిషాల దర్శనంపై శివానీ ఇచ్చిన క్లారిటీ ఇదే!
Advertisement

Shivani Nagaram: శివానీ నాగారం.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts), ‘హే బల్వంత్’ (Hey Balwanth) వంటి చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం (Shivani Nagaram).. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. శివానీ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తిరుమల (Tirumala)లో ఆమెకు 15 నిమిషాల పాటు శ్రీవారి దర్శనం లభించిందనే అంశంపై నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఆమె ఒక వీడియో ద్వారా అసలు ఏం జరిగిందో స్పష్టతనిచ్చారు. తనకు స్వామివారి దగ్గర నిలబెట్టి 15 నిమిషాలు దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించలేదని, అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని శివానీ ఈ వీడియో క్లారిటీ ఇచ్చారు.

Also Read- Aaya Sher Hook Step: ఆ హూక్ స్టెప్ నాదే.. వివాదంలో నాని ‘ఆయా షేర్’ హుక్ స్టెప్, ఇంతకీ ఎవరూ ఆ ట్యూబర్?

అసలు విషయం ఏమిటంటే..

Advertisement

శివానీ నాగారం అక్టోబర్ 2025లో తన తల్లితో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. అక్కడ ఆమె ఎయిర్‌పోర్టులో క్యూ లైన్‌లో నిలబడి రూ. 10,500 విలువైన శ్రీవాణి బ్రేక్ దర్శనం (Srivani Break Darshanam) టికెట్లను కొనుగోలు చేశారు. తన వద్ద ఉన్న టికెట్ రశీదును కూడా ఆమె ఈ వీడియోలో సాక్ష్యంగా చూపించారు. ఇంటర్వ్యూలో తాను చెప్పిన ‘15 నిమిషాలు’ అనే పదం దర్శన సమయాన్ని ఉద్దేశించింది కాదని ఆమె వివరించారు. దర్శనం కోసం క్యూ లైన్‌లో వెళ్తున్నప్పుడు, దూరం నుంచే స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది. అలా లైన్‌లో వెళ్తూ, 13 సంవత్సరాల తర్వాత స్వామివారిని అలా దగ్గరగా దర్శించుకుని బయటకు వచ్చే వరకు ఉన్న ఆ అనుభూతి మొత్తాన్ని కలిపి అలా చెప్పినట్లుగా ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు.

Also Read- Faria Abdullah : అందాలతో పిచ్చెక్కిస్తున్న చిట్టి.. పిల్లలు కళ్లు మూసుకోండమ్మా..!

జెన్యూన్‌గా షేర్ చేసుకున్న అనుభవం

Advertisement

గతంలో తాను సాధారణ భక్తురాలిగా రూ. 300 టికెట్ ద్వారా కూడా దర్శనం చేసుకున్నానని, అప్పుడు కేవలం కొద్ది సెకన్లు మాత్రమే దర్శనం లభించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు ఎలాంటి ప్రత్యేక విఐపి ప్రోటోకాల్ దక్కలేదని, తాను కూడా సామాన్య భక్తురాలిలాగే టికెట్ కొనుగోలు చేసి దర్శనం చేసుకున్నానని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం ఇచ్చే ఎవరైనా ఈ దర్శన సౌకర్యాన్ని పొందవచ్చని ఆమె తెలిపారు. ‘నేను చాలా హ్యాపీగా ఫీలయ్యి, జెన్యూన్‌గా షేర్ చేసుకున్న నా అనుభవాన్ని పంచుకున్నాను. అది ప్రస్తుతం తప్పుగా అర్థం చేసుకోబడటంతో ఈ వివరణ ఇస్తున్నాను’ అని శివాని పేర్కొన్నారు.

Also Read- Star Actor: పాకెట్ మనీ కావాలంటే భార్యను అడగాల్సిందే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×